హాంకాంగ్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన సింధూరం.. టైటిల్ కి అడుగుదూరం.. PV Sindhu storms into Hong Kong Open final

Pv sindhu storms into hong kong open final

pv sindhu, sindhu, pv sindhu india, Tai Tzu Ying, sameer, Ng Ka Long Angus, hong kong open, finals, sindhu hong kong open, hong kong open final, hong kong pv sindhu, badminton news, badminton

Rio Olympic silver medallist P V Sindhu made it to her second successive summit clash in women’s singles at the Hong Kong Open.

హాంకాంగ్‌లో డబుల్ థమాకా.. ఫైనల్స్ లోకి సింధు, సమీర్..

Posted: 11/26/2016 10:04 PM IST
Pv sindhu storms into hong kong open final

హాంకాంగ్‌లో సూపర్‌ సిరీస్‌ భారత వర్థమాన షట్లర్లు డబుల్‌ ధమాకా సాధించారు.మహిళల, పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌కు పివి సింధు, సమీర్‌ వర్మలు చేరి తమ సత్తా చాటారు. సెమీస్‌ పోరులో పివి సింధు స్థానిక క్రీడాకారిణి చెయింగ్‌ నగన్‌పై 21-14, 21-16తో జయభేరి మోగించి రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ వేటకు సిద్దమైంది. ఆదివారం తైవాన్‌కు చెందిన టా టిజు యింగ్‌తో టైటిల్‌ వేటకు సిద్దమైంది. 43వ ర్యాంకర్‌ సమీర్‌ ప్రపంచ నెంబర్‌-3 డెన్మార్క్‌ ఆటగాడు జార్గెన్‌సెన్‌పై సంచలన విజయం సాధించి తొలిసారిగా సూపర్‌ టైటిల్‌ వేటలో స్థానిక ఆటగాడు ఎన్‌జి కా లాంగ్‌ అంగస్‌ను ఢకొీననున్నాడు.

జాతీయ ఛాంపియన్‌,వర్థమాన షట్లర్‌ సమీర్‌ వర్మ హాంకాంగ్‌ 'సూపర్‌' సిరీస్‌లో సంచలనం సృష్టించాడు. సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్‌-3 జార్గెన్‌సెన్‌కు షాకిచ్చి కెరీర్‌లో తొలిసారిగా హాం కాంగ్‌ టైటిల్‌ వేటకు సిద్దం అయ్యాడు. శనివారం నాటి కీలకమైన సెమీస్‌లో ప్రపంచ 43వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ సత్తా చాటాడు. కెరీర్‌లో తొలిసారిగా హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన సమీర్‌ నువ్వానేనా అన్నట్లుగా సాగిన సెమీ ఫైనల్లో ప్రపంచ నెంబర్‌-3, డెన్మార్క్‌ షట్లర్‌ జార్గన్‌సెన్‌పై 21-19, 24-22తో విజయం సాధించాడు.

తొలి గేమ్‌లో 7-1 ఆధిక్యంలోకి వెళ్లిన సమీర్‌ జార్గన్‌సెన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రత్యర్థి అద్భుతమైన ప్రావీణ్యంతో ఆధిక్యాన్ని 10-11కు తగ్గించి ముందంజ వేశాడు. ఇద్దరు వరుస పాయింట్లతో పోరాడారు. 16-16తో ఉత్కంఠ భరితంగా సాగారు. మరో ఐదు పాయింట్లకు చేరితో విజయం వరించే దశలో సమీర్‌ దూకుడు పెంచాడు. క్రాస్‌ కోర్టు షాట్లు, స్మాష్‌లతో 21-19తో తోలి సెట్‌ను తన ఖాతాలో సమీర్‌ వేసుకు న్నాడు. కీలకమైన రెండో గేమ్‌లో ప్రత్యర్ధి జార్గెన్‌సెన్‌ సమీర్‌ కోర్టు అంతా తిప్పుతూ 11-6తో ముందంజ వేశాడు.

ఈ నేపథ్యంలో పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. సమీర్‌ వెంటనే పుంజుకుని 13-12తో దూసుకెళ్లాడు. మళ్లీ దూకుడు పెంచిన జార్గెన్‌సెన్‌ 18-19 ముందంజ వేశాడు. ఆ తర్వాత గేమ్‌ 20-20తో సమం అయ్యింది. చక్కని క్రాస్‌ కోర్టు షాట్‌లతో అలరించి జార్గెన్‌సెన్‌పై 24-22తో జయభేరి మోగించాడు. సమీర్‌ వర్మ కెరీర్‌లో తొలిసారిగా సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. భారత్‌ తరపున సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌కు చేరిన మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది పాల్గొన్న అన్ని టోర్నీల్లోను సమీర్‌ మంచి ఆటతీరు కనపర్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  Tai Tzu Ying  sameer  Ng Ka Long Angus  hong kong open  finals  badminton  

Other Articles