Indian shuttler Anand Pawar reaches finals of Brazil Grand Prix

Anand pawar marches into brazil grand prix final

anand pawar, badminton, brazil open grand prix, Misha Zilberman, brazil grand prix, indian badminton news, badminton news, badminton, sports, sports news

India's Anand Pawar advanced to the final of the Brazil Grand Prix after registering a 18-21, 21-14, 21-12 win over Israel's Misha Zilberman

బ్రజిల్ గ్రాండ్ ఫ్రిక్స్ ఫైనల్ లోకి అనంద్ పవర్

Posted: 09/03/2016 07:32 PM IST
Anand pawar marches into brazil grand prix final

బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షెట్లర్ ఆనంద్ పవార్ తుది ఘట్టానిని దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో ఆద్యంత ఆద్భుత ప్రతిభ కనబరిచిన ఆనంద్ పవార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ప్రపంచ రెండో సీడ్ ఆటగాడు ఇజ్రాయిల్ ఆటగాడు మిషా జిల్బర్ మెన్ ను ప్రపంచ నాల్గవ సీడ్ అనంద్ పవార్ 18-21,  21-14, 21-12తో ఓడించాడు. 69 నిమిషాల పాటు సాగిన పోరులో పవార్ తన మెరుగైన అటతో రాణించాడు.

అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నాల్గో సీడ్ పవార్ 21-8, 21-10 తేడాతో అన్ సీడెడ్ బీఆర్ సంకీర్త్(కెనడా)పై గెలిచి సెమీస్ కు చేరాడు. 2015లో స్విస్ అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్ కు చేరిన తరువాత ఆనంద్ పవార్ కు ఇదే తొలి సెమీ ఫైనల్. తొలి రౌండ్లో  21-6, 21-7 తేడాతో బ్రెజిల్ ఆటగాడు మాథ్యూస్ వైగ్ట్ను మట్టికరిపించిన పవార్.. రెండో రౌండ్లో 21-8, 21-8 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు విల్సన్పై విజయం సాధించాడు.

ఈ ఏడాది ఫైనల్స్ కు చేరడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన పవార్.. తన తదుపరి పోరులో మలేసియాకు చెందిన జుల్పాడీ జుల్కీఫీ.. బ్రెజిల్ ఘోర్ సెల్హో డి అలివీరా ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలుపోందిన వారితో తలపడనున్నారు. ఇదిలా ఉండగా, మిక్స్డ్ డబుల్స్ లో సిక్కి రెడ్డి- చోప్రా జంట కూడా సెమీస్ కు చేరింది. ఈ జోడి 21-18, 21-11 తేడాతో ఆతిథ్య బ్రెజిల్ జంట మాథ్యూస్ వైగ్ట్- బియానికా ఓలివిరియా లిమాపై గెలిచి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ జంట  తమ ఫైనల్ బెర్తు కోసం జర్మనీ ద్వయం ఫబియన్ హోల్జర్-బార్బరా బెల్లింగ్ బర్గ్లతో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anand Pawar  Misha Zilberman  brazil grand prix open  badminton  

Other Articles