Rio 2016 Olympics declared closed, over to Tokyo 2020 now

Brazil bows out with lavish closing ceremony of rio olympics

rio closing ceremony, rio closing ceremony maracana stadium, maracana stadium, rio olympics closing ceremony, closing ceremony updates, closing ceremony tv, rio closing ceremony indian timing, rio closing ceremony tv timings, rio closing ceremony tv, rio 2016 olympics, rio, olympics, closing ceremony

Rio de Janeiro wrapped up the 2016 Olympics with a lavish show of Brazilian culture as the country exulted in a games that far exceeded expectations at home and abroad.

రియోకు సెలవు.. టోక్యో లో మళ్లీ కలుద్దాం..

Posted: 08/22/2016 05:46 PM IST
Brazil bows out with lavish closing ceremony of rio olympics

పక్షం రోజుల్లో.. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు, అద్భుతమైన విన్యాసాలకు వేదికగా నిలిచి.. క్రీడాభిమానులకు కన్నుల పండగ చేసిన రియో ఒలింపిక్స్ నేటితో ముగిశాయి. పదహారు రోజుల పాటు అభిమానుల్ని అలరించిన ఒలింపిక్స్ పోటీలకు తెరపడింది. మారకానా స్టేడియంలో ఒలింపిక్ జ్యోతిని అర్పివేసిన అనంతరం ఈ మెగా ఈవెంట్కు ముగింపు పలుకుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. చివర్లో జరిగిన బాణసంచా విన్యాసాలతో ఒలింపిక్స్ కు రియో ఘనంగా వీడ్కోలు పలికింది. రియో మేయర్ ఎడ్యూర్డో పైస్ ఒలింపిక్ పతాకాన్ని 2020 ఒలింపిక్స్ జరిగే టోక్యో గవర్నర్ యురికే కొయికేకు అప్పగించారు. దీంతో రియోకు గుడ్ బై చెబుతూ, టోక్యోకు స్వాగతం పలికారు. ఈ ముగింపు వేడుకలకు జపాన్ ప్రధాని షింజూ అబే హాజరయ్యారు. ఆయన ఎరుపు టోపీ ధరించి సూపర్ మారియా వేష ధారణలో టోక్యో నుంచి రియోకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.0

రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు నుజ్మాన్ కార్లోస్ ప్రసంగించిన అనంతరం థామస్ బాచ్ తన సందేశాన్ని వెల్లడించారు. మరో నాలుగేళ్లలో రానున్న టోక్యో ఒలంపిక్స్ లో కలుద్దామని ఆయన క్రీడాభిమానులకు తెలిపారు. వివిధ ఈవెంట్లలో పాల్గొన్న భారత్ రెండు పతకాలతో 67  స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూనైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ నుంచి పివి సింధు బ్యాడ్మింటన్ లో  రజత పతకం సాధించగా, సాక్షి మాలిక్ రెజ్లింగ్‌ విభాగంలో కాంస్యం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  closing ceremony  brazil  India  PV Sindhu  Sakshi Malik  

Other Articles