Gymnast Dipa Karmakar creates history by entering Rio Olympic final

Gymnast dipa karmakar creates history by entering rio olympic final

Gymnast Dipa Karmakar, Dipa Karmakar rio olympics, Dipa Karmakar in finals, Dipa Karmakar history, Gymnast Dipa Karmakar medal

ఒలంపిక్స్ జిమ్నాస్టిక్ ఫైనల్లో దీపా కర్మాకర్ | Gymnast Dipa Karmakar creates history by entering Rio Olympic final

సంచలనం భారత జిమ్నాస్టిక్ ఆశాదీపం

Posted: 08/08/2016 05:53 PM IST
Gymnast dipa karmakar creates history by entering rio olympic final

రియో ఒలంపిక్స్ లో పతకాల పట్టికలో ఖాతా ఇంకా తెరవక పోయినప్పటికీ కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైపోతుంది. మొదటిసారి ఒలంపిక్స్ కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తొలిసారి ఆ విభాగంలో ఫైనల్ కు చేరింది. తద్వారా 52 ఏళ్ల జిమ్నాస్టిక్స్‌ విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన ఇండియన్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

ఆదివారం జరిగిన మహిళ క్వాలిఫయింగ్ రౌండ్‌, వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేపింది.  తొలి ప్రయత్నంలోనే 15.100తో దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచినా.. రెండో ప్రయత్నంలో 14.600తో అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది. చివరి రౌండ్ లో కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ పుంజుకుని 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. నిబంధనల ప్రకారం తొలి ఎనిమిది స్థానాలు సాధించినవారు ఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఆ లెక్కన దీప 8వ స్థానంతో ఫైనల్ కి అర్హత సాధించినట్లయ్యింది. ఆల్‌రౌండ్ విభాగంలో దీప ఓవరాల్‌గా 51.665 పాయింట్లు స్కోర్ చేసి 27వ స్థానంలో నిలిచింది.

త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీపా కర్మాకర్ ప్రొడునొవాలో ఆరితేరిన జిమ్నాస్ట్. ఆమె కెరీర్ లో మొత్తం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను గెలిస్తే, అందులో 67 గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా అరుదైన రికార్డు సృష్టించిన ఆ ఉత్సహాంతోనే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 5వ స్థానం కైవసం చేసుకుంది. తద్వారా ఒలంపిక్స్ కు ఆ విభాగంలో అర్హత సాధించిన తొలి భారతీయురాలుగా నిలిచింది. ఒలంపిక్స్ కోసం గత మూడు నెలలుగా దీపా రోజుకు ఎనిమిది గంటలకు పైగా కఠోరంగా శ్రమించిందట. నిజానికి ఈ విభాగంలో ఫైనల్ కు వెళ్లటం అంటే మాములు విషయం కాదు.

భారత్‌కు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే జిమ్నాస్ట్ విభాగంలో ఒలింపిక్స్ బరిలో పోటీ చేశారు. అది కూడా 11 మంది పురుషులు కావడం విశేషం. ఈ విభాగంలో అమెరికా, జపాన్, చైనా లాంటి దేశాలతో గట్టిపోటీ ఉంటుంది. అలాంటిది దీప సాధించిన ఈ విజయం దేశం గర్వించదగ్గదే. ఏది ఏమైనా ఆగస్టు 14న జరగబోయే ఆమె ఫైనల్‌ పతక వేట కోసం వంద కోట్ల కళ్లు ఎదురు చూస్తుంటాయన్నది మాత్రం అక్షరాల నిజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gymnast  Dipa Karmakar  rio olympics  2016  final  

Other Articles