Champions Trophy Hockey: Youngsters shine for India

Hockey india to reward heroes for winning silver medal

Australia, Champions Trophy hockey, Harmanpreet Singh, Hockey India, India, Narender Batra, hockey news, sports news

India's silver medal winning performance in the 36th Hero Champions Trophy has earned the players and team officials a reward from Hockey India.

యువభారత హాకీ జట్టు రజతం సాధించింది..

Posted: 06/18/2016 03:53 PM IST
Hockey india to reward heroes for winning silver medal

చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన టీమిండియా పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలై రజతానికి పరిమితమైంది. టైటిల్ నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్లో  ఆస్ట్రేలియా మూడో గోల్స్ చేసి పైచేయి సాధించగా, భారత్ కు ఒక గోల్ మాత్రమే నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో హర్మన్ ప్రీత్ సింగ్ తన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ సాధించగా,  ఎస్ కే ఉతప్ప, ఎస్వీ  సునీల్, సురేందర్ లు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమయ్యారు.

దీంతో ఈ టోర్నీలో  తొలిసారి ఫైనల్ కు వెళ్లిన భారత్ రన్నరప్ గా సరిపెట్టుకుంది. నిష్ణాతులైన సీనియర్లు లేని లోటును జట్టు కు బలహీనంగా మారినప్పటికీ టీమిండియా యువ హాకీ టీమ్ రజతం సాధించింది. మరోవైపు పటిష్టమైన ఆస్ట్రేలియా అరాన్ జలేస్కీ, డానియల్ బీలే, సిమన్ ఓర్చాడ్లు తలో గోల్ చేసి విజయంలో ముఖ్యభూమిక పోషించారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా బీలే వేసిన గోల్ నమోదు చేసిన రెండో గోల్ వివాదస్పదమైంది.  

ఆ గోల్ పై మ్యాచ్ అనంతరం భారత జట్టు  నిరసన వ్యక్తం చేయడంతో తుది ఫలితాన్ని ప్రకటించటానికి కాస్త సమయం పట్టింది. ఈ టోర్నీలో 1982లో భారత్ కాంస్య పతకం మాత్రమే సాధించగా, తొలిసారి రజతం సాధించడం విశేషం. భారత్ రజతం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ జట్టు సభ్యులను అభినందించారు. 'చాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన హాకీ జట్టుకు అభినందనలు. భారత జట్టు ఫైనల్ కు చేరే క్రమం నిజంగా అద్భుతం. జట్టు ఆటతీరును చూసి యావత్ భారత జాతి గర్విస్తుంది' అని మోదీ తన ట్వీట్ లో ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  hockey  silver medal  australia  final  champions trophy  

Other Articles