Boxer Vijender to meet Aussie Kerry Hope in WBO Asia title decider

Vijender singh to take on australian kerry hope in delhi on july 16

Vijender Singh,Vijender Delhi bout,Vijender vs Kerry Hope,Vijender Delhi fight,Vijender Thyagaraj Stadium

Vijender Singh, who has had a sensational run as a pro-boxer since his debut in October last year, will fight his first bout in India next month.

ఏడో బౌట్ కు సిద్దమవుతున్న విజేందర్..

Posted: 06/06/2016 08:33 PM IST
Vijender singh to take on australian kerry hope in delhi on july 16

భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తదుపరి పోరాటానికి డబ్ల్యూబీవో ప్రత్యర్ధిని ఖరారు చేసింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన అనంతరం వరుసగా ఆరు బౌట్ లలో గెలిచిన విజేందర్ ఈ నెల 16న ఢిల్లీలోని త్యాగరాయ స్టేడియంలో ఏడవ బౌట్ ఆడనున్నాడు. ఇందులో చైనా లేదా కొరియన్ తో విజేందర్ తలపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొనగా, మాజీ యూరోపియన్ ఛాంపియన్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ కెర్రీ హోప్ ను డబ్ల్యూబీవో ఎంపిక చేసింది. ఇప్పటి వరకు 30 బౌట్ లు ఆడిన కెర్రీ 23 బౌట్లలో విజయం సాధించగా, రెండు బౌట్ లలో నాకౌట్ గా నిలిచాడు.

తదుపరి పోరుపై హోప్ మాట్లాడుతూ, 'విజేందర్ సింగ్ భారత్ లో సూపర్ స్టార్ కావచ్చు, కానీ నావరకు మాత్రం అతను జస్ట్ బాక్సర్' అని చెప్పాడు. అదీకాక అతను ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగుపెట్టి కేవలం ఏడాది మాత్రమే అయిందని, సొంత దేశంలో ఆడుతుండడంతో అభిమానులు ఆదరణతో పాటు అంతే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుందని చెప్పాడు. దానిని తాను క్యాష్ చేసుకుంటానని అన్నాడు. అండర్ డాగ్ గా బరిలో దిగి విజేందర్ పై విజయం సాధిస్తానని కెర్రీ హోప్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijender singh  Australia  Kerry Hope  boxing  Delhi  

Other Articles