Cameroon player Patrick Ekeng dies after football match in Romania

Cameroon mid fielder ekeng dies during league game

patrick ekeng dies, patrick ekeng dead, patrick ekeng death, patrick ekeng collapse video, patrick ekeng no more, patrick ekeng football, footballer patrick ekeng, football

Patrick Ekeng, 26, fell to the ground shortly after coming on as a 62nd-minute substitute during a league match against Viitorul Constanta.

మరో క్రీడాకారుడి విషాదాంతం.. ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు

Posted: 05/07/2016 07:17 PM IST
Cameroon mid fielder ekeng dies during league game

ఆటలో మరో విషాదం చోటుచేసుకుంది. స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ ఓ ప్లేయర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గత రెండేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ మృతిచెందడంతో అ దేశ అధికారులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కామెరున్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ డినామో తరఫున విటోరల్ కాంటాంటా జట్టుపై శుక్రవారం మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

26 ఏళ్ల మిడ్ ఫీల్డర్ కుప్పకూలిపోవడంతో సహచరులు వచ్చి చూడగా అతడిలో కదలిక లేదు. దీంతో సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎకెంగ్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ ఆటగాడిని తీసుకుని మ్యాచ్ కొనసాగించారు. సుమారు గంటపాటు డాక్టర్లు అతడ్ని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని డినామో క్లబ్ డాక్టర్ లివియు పాల్టినియన్ మీడియాకు తెలిపారు. ఈ జనవరిలోనే పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ లో జాయిన్ అయ్యాడు. పాట్రిక్ మృతిపట్ల ఫుట్ బాల్ క్లబ్ సంతాపం ప్రకటించింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cameroon  Romanian club  midfielder  Patrick Ekeng  football  

Other Articles