Under-pressure Lee Chong Wei in All-England shock loss

Sai praneeth stuns lee chong wei in all england championship first round

Sai Praneeth, all england championships, all england badminton, lee chong wei, lee chong wei badminton, badminton lee chong wei, badminton news, badminton

The defeat ended Lee Chong Wei's 21-match winning streak, which included titles in France, China, Hong Kong, and Malaysia since October.

సంచలన విజయాన్ని అందుకున్న సాయి ప్రణీత్

Posted: 03/10/2016 08:29 PM IST
Sai praneeth stuns lee chong wei in all england championship first round

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు.  సాయి ప్రణీత్ 24-22, 22-20 తేడాతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ను బోల్తా కొట్టించాడు.  ఆద్యంతం ఇరువురి మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ అంచనాలు మించి రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
 
తొలి గేమ్లో లీంగ్ చో వీ 11-3, 15-7 ఆధిక్యంలో దూసుకువెళ్లినా, ప్రణీత్ నిలకడను ప్రదర్శించి ఆ గేమ్ను గెలిచాడు. ఆ తరువాత రెండో గేమ్లో కూడా  లీ చోంగ్ వీ 16-10, 17-12 తేడాతో ముందంజ వేశాడు. కాగా, 19వ పాయింట్ వద్ద లీ చోంగ్ వీని నిలువరించిన ప్రణీత్ ఇక్కడ మూడు పాయింట్లను సాధించి విజయ ఢంకా మోగించాడు. దీంతో మూడుసార్లు ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీ గెలిచిన లీ చోంగ్ వీ పోరు తొలి రౌండ్లోనే ముగిసినట్లయ్యింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Praneeth  Lee Chong Wei  All-England Championship  

Other Articles