India's SAG gold rush continues

India s sag gold rush continues

SAG, SAG Sports, India, Indian sports persons, Gold Medals in SAG

India's medal count crossed the 200-mark as shooters, athletes and tennis players added handsomely to the overall tally on the seventh day of the 12th South Asian Games (SAG) being held here and in Shillong. At the end of the day's events on Thursday, India's overall medal count stood at 238, including 140 gold, 78 silver and 20 bronze medals. It is India's highest gold medal haul in the history of SAG.

సౌత్ ఏషియన్ గేమ్స్ లో అదరగొడుతున్న మన ఆటగాళ్లు

Posted: 02/12/2016 04:35 PM IST
India s sag gold rush continues

సౌత్ ఏషియన్ గేమ్స్ లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి దాకా జరిగిన అన్ని ఈవెంట్లలో మన వాళ్లు పథకాలు సాధించి. కొత్త రికార్డులను నమోదు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే 11 11 స్వర్ణాలతో అదరగొట్టారు. మహిళల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమన్ దేవి అత్యుత్తమ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సుమన్ దేవి ఈటెను 59.45 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన అన్నూ రాణి 57.13 మీటర్ల దూరంతో రెండోస్థానంలో నిలిచింది. ఇక పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఆసియా క్రీడల మాజీ చాంపియన్ రంజిత్ మహేశ్వరి 16.45 మీటర్ల దూరం లంఘించి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. రంజిత్ సహచరుడు జయకుమార్ రజతం నెగ్గాడు. మిగతా భారత అథ్లెట్లలో పురుషుల షాట్‌పుట్‌లో ఓం ప్రకాశ్ కర్హానా, మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర, పురుషుల్లో అజయ్‌కుమార్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జువానా ముర్ము, పురుషుల విభాగంలో ధరుణ్ అయ్యాస్వామి, మహిళల 10,000 మీటర్ల రేసులో ఎల్ సూర్య, 200 మీటర్లలో శ్రావణి నందాలు స్వర్ణాలు సాధించినవారిలో ఉన్నారు.

షూటింగ్‌లో జరిగిన ఐదు ఈవెంట్లలోనూ స్వర్ణాలు మనోళ్లనే వరించాయి. అయితే ఫేవరెట్‌గా పోటీపడ్డ ఒలింపిక్ పతక విజేత, స్టార్ షూటర్ గగన్ నారంగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గడంలో విఫలమయ్యాడు. ఫైనల్స్‌లో నారంగ్‌ను రజతానికే సరిపెడుతూ భారత షూటర్ చైన్ సింగ్ స్వర్ణం నెగ్గాడు. ఇక ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లో నారంగ్, చైన్‌సింగ్, సురేందర్‌లతో కూడిన భారత త్రయం స్వర్ణం అందుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో సమరేశ్ జంగ్ పసిడి పతకం అందుకోగా, భారత్‌కే చెందిన పెంబా తమాంగ్, విజయ్‌కుమార్‌లకు రజత, కాంస్యాలు దక్కాయి. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో మూడు పతకాలూ భారత షూటర్లకే దక్కాయి. కుహేలీ గంగూలీకి స్వర్ణం, లజ్జా గోస్వామికి రజతం, అనూజా జంగ్‌కు కాంస్యం లభించాయి. ఇక ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లో గంగూలీ, గోస్వామి, అనూజ బృందం స్వర్ణం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SAG  SAG Sports  India  Indian sports persons  Gold Medals in SAG  

Other Articles