India jump six places to 166th in football rankings

India jump six places to 166th in football rankings

India football team, FIFA rankings, Belgium top rank

India jumped six places to the 166th spot in the global football rankings in the latest list released by FIFA on Thursday, while Belgium retained their top position after grabbing it for the first time last month. India were 172nd in last month's rankings after losing five consecutive 2018 World Cup qualifying matches

ఫిఫాలో ర్యాంకును మెరుగుపర్చుకున్న భారత్

Posted: 12/04/2015 06:18 PM IST
India jump six places to 166th in football rankings

ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లో భారత ఫుట్బాల్ జట్టు ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకింది. గతంలో 172 వ ర్యాంకులో ఉన్న భారత్ గురువారం అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించిన ర్యాంకుల్లో 166వ స్థానాన్ని ఆక్రమించింది. స్విట్జర్లాండ్ లోని జురిచ్ నగరంలో ఫిఫా ఈ ర్యాంకులు విడుదలచేసింది. గత నెలలో ఫస్ట్ ర్యాంకు సాధించిన బెల్జియం తాజా ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

గతనెలలో 2018 ప్రపంచకప్ అర్హత కోసం నిర్వహించిన మ్యాచ్ల్లో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయిన భారత్ 172వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తర్వాత నిలకడ ఆటతీరు ప్రదర్శించి ఆరు స్థానాలు మెరుగు పరుచుకుంది. బెల్జియం అగ్రస్థానాన్ని ఆక్రమించగా.. అర్జెంటైనా, స్పెయిన్, జర్మనీలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులను దక్కించుకున్నాయి.

భారత ఫుట్ బాల్ జట్టు ఆరు ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ప్రపంచ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ ను స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నగరంలో విడుదల చేశారు. గత నెల 2018లో ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల్లో పాల్గోనే జట్ల కోసం గత నెల అర్హత పోటీలు నిర్వహించగా, భారత జట్టు పేలవమైన ఆటతీరుతో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో 172వ స్థానానికి పడిపోయింది. ఆ తరువాత నిలకడైన ఆటతీరు ప్రదర్శించడంతో ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 166వ స్థానంలో నిలిచింది. గత నెలలో అగ్రస్థానం కైవసం చేసుకున్న బెల్జియం ఈ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. తరువాతి ర్యాంకుల్లో అర్జెంటీనా, స్పెయిన్, జర్మనీ ఫుట్ బాల్ జట్లు నిలిచాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India football team  FIFA rankings  Belgium top rank  

Other Articles