Arvind Bhat retires from international badminton

Badminton star arvind bhat retires

Arvind Bhat, Badminton, retirement, Former national champion Arvind Bhat, coach, 2014 German Open winner Arvind Bhat, Arvind Bhat coaching stints.

Former national champion and 2014 German Open winner, Arvind Bhat has retired from international badminton, citing his desire to concentrate on coaching stints

కోచ్ గా మారనున్న అరవింద్.. ఆటకు వీడ్కోలు

Posted: 11/22/2015 07:33 PM IST
Badminton star arvind bhat retires

జాతీయ మాజీ బ్యాడ్మింటన్ చాంపియన్, గత ఏడాది 2014 జర్మన్ ఓపెన్ విజేత అరవింద్ భట్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో కోచ్‌గా మారేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల అరవింద్ తెలిపాడు. ‘ఇక బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడను. గత ఆరు నెలలపాటు ఆలోచించి ఈ మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పాడు.. హైదరాబాద్‌లోని అకాడమీలో కోచ్‌గా బాధ్యతలు తీసుకునే ఆలోచన ఉందిని తెలిపాడు.

2008, 2011లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన అరవింద్.. 2002లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి థామస్ కప్‌ పోటీలలో ఏడు పర్యాయాలు పాల్గొన్నాడు. 2010 ఆసియా క్రీడల్లో ఒకసారి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగుసార్లు బరిలోకి దిగాడు. కోచ్‌గా మారాలని అనుకుంటున్న అరవింద్ ఇటీవల డచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి భారత జట్టుతో ఉన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Bhat  Badminton  retirement  coach  

Other Articles