rajyavardhan rathore | olympics | inspire | shooter | shriyanka sadang

Rajyavardhan rathore s olympics glory inspired me says shooter shriyanka sadang

Olympics, Rajyavardhan Rathore, shooting, Shriyanka Sadangi, shooting as a sport, Daughter of an army man, 13th Asian Shooting Championship, 10-meter air rifle junior women’s event

Shriyanka Sadangi hard work and determination towards the sport shooting has helped her achieve that goal.

రాధోడ్ నాకు స్పూర్తి: శ్రీయాంక

Posted: 11/18/2015 05:21 PM IST
Rajyavardhan rathore s olympics glory inspired me says shooter shriyanka sadang

తాను భారత జాతీయ జట్టుకు ఆడతానని కలలో కూడా అనుకోలేదని మహిళా షూటర్ శ్రియాంక సదంగి స్పష్టం చేసింది. జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా వుందని తెలిపింది. ఇటీవల కువైట్ నగరంలో జరిగిన 13 వ ఆసియన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో జూనియర్ మహిళల టీమ్ ఈవెంట్ లో రజత పతకం సాధించిన శ్రియాంక..  జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం నిజంగా గర్వంగా ఉందని పేర్కొంది. కువైట్ లో జరిగిన ఈ పోటీలలో ఇరాన్ జట్టును తరువాత నిలిచింది భారత జట్టు. ఆ తరువాత మూడో స్థానంలో కొరియా జట్టు నిలిచింది.
 
తనకు ఊహ తెలిసినప్పట్నుంచీ  షూటింగ్ లో రాణించాలనే తపన ఎక్కువగా ఉండేదని తెలిపింది. అయితే తాను షూటింగ్ ను క్రీడగా ఎంచుకోవటానికి భారత స్టార్ షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్ ప్రధాన కారణమని పేర్కొంది. 2004 లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో రాధోడ్ రజతం గెలవడమే తనలో స్ఫూర్తిని నింపిందని శ్రియాంక తెలిపింది. తాను రాధోడ్ మాదిరిగానే షూటింగ్ విభాగంలో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriyanka Sadangi  shooting  Olympics  Rajyavardhan Rathore  

Other Articles