Robert Lewandowski Creates New Record By Scored FIVE GOALS in 9 Minutes | Football Controversies

Robert lewandowski scored five goals in 9 minutes

Robert Lewandowski, five goals in 9 mins, Robert Lewandowski latest news, football records, Robert Lewandowski new record

Robert Lewandowski Scored FIVE GOALS in 9 Minutes : Robert Lewandowski came on at halftime and certainly made an impact, scoring five goals in his nine minutes.

ఫుట్ బాల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. చుక్కలు చూపించిన రాబర్ట్

Posted: 09/23/2015 02:55 PM IST
Robert lewandowski scored five goals in 9 minutes

మునుపెన్నడూలేని విధంగా ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో సరికొత్త అరుదైన రికార్డు నమోదైంది. ప్రముఖ ప్లేయర్ రాబర్ట్ లివాండోవ్ స్కీ ఈ రికార్డును నెలకొల్పాడు. కేవలం 9 నిముషాల వ్యవధిలోనే 5 గోల్స్ చేసి చరిత్రపుటలకెక్కాడు. బైరెన్ మ్యూనిచ్, వోల్ఫ్స్ బర్గ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డు నమోదైంది. లివాండోవ్ ప్రదర్శించిన అద్భుతమైన ఆటతీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

జర్మనీలో ఛాంపియన్స్ వున్న మ్యూనిచ్ జట్టు, వోల్ఫ్స్ బర్గ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఆట తొలి సగభాగం ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. వోల్ఫ్స్ బర్గ్ జట్టు ఎలాగోలా ఒక గోల్ సంపాదించింది. దీంతో తొలిసగభాగం ముగిసేసరికి మ్యూనిచ్ జట్టు 0-1తో వెనుకంజలో వుండిపోయింది. ఆ తర్వాత మొదలైన రెండో సగభాగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యూనిచ్ జట్టు ఆటగాడైన రాబర్ట్.. మూడు నిముషాల వ్యవధిలోనే మూడు గోల్స్ వరుసగా వేసి.. జట్టును ఆధిక్యంవైపుగా తీసుకెళ్లాడు. అంతటితో ఆగలేదు.. అదే ఊపుమీద కేవలం 19 సెకన్ల వ్యవధిలో అతగాడు మరో రెండు గోల్స్ వేసేశాడు. అంతే.. మైదానంలో వున్న క్రీడాభిమానులతోపాటు ప్రత్యర్థి ఆటగాళ్లు, ప్రముఖులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పోలెండ్ కు చెందిన ఈ స్ట్రైకర్ హవా మ్యాచ్ 51 నిముషాల వ్యవధిలో మొదలుకాగా.. మ్యూనిచ్ జట్టు 5-1తో గెలుపొందింది. దీంతో గెలుపొందిన జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

ఇదిలావుండగా.. తన అద్భుత ఆటతీరుతో కేవలం 9 నిముషాల వ్యవధిలో 5 గోల్స్ వేసి రికార్డు నెలకొల్పిన రాబర్ట్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. రాబర్ట్ ఆటతీరు అమోఘం... కేవలం 9 నిముషాల వ్యవధిలో 5 గోల్స్ వేయడం సరికొత్త రికార్డేనంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఏదేమైనా.. రాబర్ట్ తన ప్రతిభతో ప్రపంచ క్రీడాకారుల్ని తనవైపు దృష్టి మరలించుకున్నాడు. భవిష్యత్తులో ఇతని రికార్డును బ్రేక్ చేసే ఘనుడు వస్తాడో లేదో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robert Lewandowski  FootBall records  

Other Articles