Shah Rukh Khan met his fan girl Saina Nehwal

Shah rukh s tuk tuk moment with saina nehwal

shah rukh khan, saina nehwal, shah rukh khan meets saina nehwal, shah rukh khan twitter, saina nehwal twitter, dilwale, shah rukh khan in dilwale, saina nehwal badminton star, shah rukh khan actor, shah rukh khan news, bollywood news, entertainment news

True to his word, Shah Rukh Khan kept his date with badminton star, Saina Nehwal and looks like the duo also played a match.

అరుదైన అభిమానిని కలుసుకున్న షారుఖ్ ఖాన్

Posted: 09/18/2015 07:00 PM IST
Shah rukh s tuk tuk moment with saina nehwal

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. తన అభిమాన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను కలిసి తన ముచ్చట తీర్చుకుంది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలియజేసింది. షారుఖ్‌ చాలా సృజనాత్మకత కలిగిన వ్యక్తి అని, ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా 'దిల్‌వాలే' షూటింగ్‌ చూపించినందుకు చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను సైనా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తనతో పాటు తన సోదరి కూడా వరుణ్, కృతిలతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమంలో అప్ లోడ్ చేసి అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో బాలీవుడ్ చిత్రం దిల్ వాలే షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిన సైనా తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ ను కలుసుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది. 'హలో సర్.. మీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని తెలిసింది. మిమ్మల్ని కలవాలని ఉంది' అని సైనా ట్వటర్ లో పోస్ట్ చేసింది. దీనికి వెంటనే స్పందించిన షారుఖ్ ఖాన్ సమాధానమిస్తూ 'నిన్నెప్పుడు కలవాలో చెప్పు' అంటూ అడిగాడు. వెంటనే సైనా శుక్రవారం కలుస్తానని సమాధానం ఇచ్చింది. ఈ సినిమాలో షారూఖ్ సరసన కాజోల్ నటిస్తోంది. ఇప్పటికే సైనా ఆ ఫోటోను ట్విటర్‌లో ట్వీట్ చేసింది. కాజోల్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shah rukh khan  saina nehwal  bollywood actor  badminton star  

Other Articles