Shelly-Ann Fraser-Pryce clinches her third World Championship 100m title in Beijing

Shelly ann frase wins 100 meters race

Shelly Ann Fraser, Pryce, World Championship, jamaica, 100 meters sprinter, 100m sprinter title, Beijing

Shelly-Ann Fraser-Pryce's dominance over 100 metres continued as the Jamaican retained her World Championship crown in Beijing.

మూడో పర్యాయం స్వర్ణం గెలిచిన షెల్లీ

Posted: 08/25/2015 07:38 PM IST
Shelly ann frase wins 100 meters race

ప్రపంచ చాంపియన్షిప్ వంద మీటర్ల మహిళల విభాగం స్ప్రింట్ రేసులో షెల్లీ అన్ ఫ్రేసర్ తన విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ 100 మీటర్ల రేసులో జమైకా స్టార్ ముచ్చటగా మూడోసారి స్వర్ణంతో మెరిసింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ మహిళల 100 మీటర్ల రేసును మూడుసార్లు నెగ్గిన తొలి అథ్లెట్‌గా షెల్లీ అరుదైన ఘనత సాధించింది. ఈ రేసును 10.76 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. 2009, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 100
మీటర్ల విభాగంలో  ఆమె పసిడి పతకాలు నెగ్గింది.

ఇక మహిళల 100 మీటర్ల రేసులో  ఒలింపిక్ స్వర్ణపతకం నెగ్గిన తొలి కరీబియన్ అథ్లెట్గా షెల్లీ మరో రికార్డు నెలకొల్పింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించింది. సాధారణంగా  స్ప్రింట్ రేసుల్లో పొడుగ్గా ఉంటే అథ్లెట్లు
రాణిస్తుంటారు. జమైకా సంచలనం షెల్లీ ఆన్ ఫ్రేజర్ మాత్రం ఎత్తు కంటే వేగమే ముఖ్యమని నిరూపించింది. ఎత్తు ఐదడుగులే ఉన్నా 100 మీటర్ల రేసులో రికార్డుల మోత మోగిస్తోంది. షెల్లీ ముద్దుపేరు 'పాకెట్ రాకెట్'.. ట్రాక్పై మాత్రం 'ఐదడుగుల
రాకెట్'.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shelly ann frase  jamaica  100 meters sprinter  

Other Articles