Saina Nehwal dethrones Carolina Marin to regain No.1 rank

Saina nehwal regains world no1 spot

Saina Nehwal, Badminton Saina Nehwal Regains World No.1, Carolina Marin, Taipei's Tai Tzu Ying, Li Xuerui, latest rankings, Badminton World Federation, BWF, latest Badminton news

The 25-year-old Saina Nehwal rose a place to overtake her conqueror in the summit clash, Carolina Marin of Spain, to once again be ranked No.1. The reigning World Champion dropped to No.2 while Chinese Taipei's Tai Tzu Ying overtook reigning Olympic champion Li Xuerui of China to be No.3.

ప్రపంచ బ్యాడ్మింటన్ తాజా ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో మళ్లీ సైనా నెహ్వాల్

Posted: 08/20/2015 07:22 PM IST
Saina nehwal regains world no1 spot

ప్రపంచ బ్యాడ్మింటన్ తాజా ర్యాంకింగ్స్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయం పాలై.. రజకంతో సరిపెట్టుకున్న సైనా.. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. బీడబ్లుఎఫ్ ప్రకటించిన తాజా ర్యాంకుల ప్రకారం, ఛాంపియన్ షిప్ లో సైనాను ఓడించి స్వర్ణం గెలుచుకున్న కరోలినా మారిన్ రెండవ స్థానంలో కోనసాగుతోంది.

ఇక చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జూ యింగ్ మూడవ స్థానం, చైనా క్రీడాకారిణి లీ జురై నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. అటు వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకున్న పీవీ సింధు 14వ స్థానానికి పడిపోయింది. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ నాలుగవ స్థానానికి పడిపోగా, పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  latest rankings  Badminton World Federation  BWF  

Other Articles