Saina Nehwal defeats , aims for gold medal in World Badminton Championships

Saina nehwal reaches maiden world badminton championships finals

Saina Nehwal, Wang Yihan, seimi finals, saina confirms medal, badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal, gutta jwala, ashwini, kashyap, pranoy, kidambi srikanth, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Second seed Saina Nehwal booked a place into the women's singles semifinals after a hard fought win over sixth seed Wang Yihan of China in the World Badminton Championship in Jakarta on Friday.

ప్రపంచ చాంపియన్‌షిప్‌ :పైనల్స్ లోకి సైనా.. స్వర్ణంపైనే గురి

Posted: 08/15/2015 05:07 PM IST
Saina nehwal reaches maiden world badminton championships finals

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ సంచలనం సృష్టించింది. భారత షెట్లర్లు అందరూ క్రమంగా ఒకరి తరువాత మరోకరు క్వార్టర్స్ వరకు వచ్చి.. అక్కడి నుంచి వెనుదిరిగిన నేపథ్యంలో సెకెండ్ సీడ్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాత్రం ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. గతంతో ఎదురైన చేధు అనుభవాలను గుర్తుపెట్టుకుని నిన్న క్వార్టర్ ఫైన్సల్ గండాన్ని దాటి..  సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన సైనా.. ఇవాళ కూడా అదే జోరును కోనసాగిస్తూ.. ఫైనల్స్ మ్యాచ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ ఛాంఫియన్ షిప్ టైటిల్ కు సైనా మరో మ్యచ్ దూరంలో నిలిచింది.

మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న సైనా.. ఇకపై స్వర్ణ పతకాన్ని సాధించాలనే తన గురిని నిర్ధేశించుకుంది. ఇప్పటి వరకు వరల్డ్‌ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్‌లో ఎప్పుడూ క్వార్టర్స్ దాటని సైనా.. ఈ సారి తన అనవాయితీగా వస్తున్న వైఫల్యాన్ని అధిగమించింది. ఈ పోటీలలో సైనాకు ఇది తొలి పతకం కానుంది. గతంలో ఐదుసార్లు క్వార్టర్స్‌లో ఓడిన సైనానెహ్వాల్ శుక్రవారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వాంగ్‌పై 21-15, 19-21, 21-19 సైనా విజయం సాధించింది. కాగా ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్ లో ఇండోనేషియా క్రీడాకారిణి పనేత్రిపై 21-17, 21-17 స్కోరుతో ఓడించింది. వరుసగా రెండు సెట్లలో పైచేయి సాధించడంతో ఇక మూడో సెట్ కు అస్కారం లేకుండానా విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  Saina Nehwal  Wang Yihan  Medal  World Badminton Championship  

Other Articles