As murders soar, El Salvador gangs want to talk truce

Five players shot dead at el salvador football match

Gang, gang violence, criminal gang, shooting, football, El Salvador, Latin America, Five Players Shot Dead, El Salvador Football Match, Salvadorean town of Delgado, Sunday football match, unknown gunman

The players were shot by an unknown gunman during a Sunday football match in the Salvadorean town of Delgado; the victims were all playing for one team

ఎల్‌సాల్విడర్‌లో దారుణం ఫుట్‌బాల్‌ ఆటగాళ్లపై తూటాల వర్షం.. ఐదుగురు మృతి..

Posted: 08/04/2015 08:40 PM IST
Five players shot dead at el salvador football match

అమెరికాలో కాల్పుల సంస్కృతి పెచ్చుమీరుతుంది. ఎక్కడో. ఒకచోట, ఎదో ఒక ఘటనలో కాల్పుల చప్పుళ్లు, తూటాల శబ్దాలు అక్కడి ప్రజలను బీతావాహ పరిస్థితులకు గురిచేస్తున్నాయి. తాజాగా, మధ్య అమెరికా దేశమైన ఎల్‌సాల్విడర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాన్‌ సాల్విడార్‌ నగరానికి ఉత్తరాన ఉన్న ఓ మైదానంలో ఫుట్‌బాల్‌ టోర్నమెంటు జరుగుతుండగా.. కొందరు అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు క్రీడాకారులు అక్కడికక్కడే మరణించగా, మరికోందరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
 
మృతులందరూ . ఒక ఫుడ్‌బాల్‌ జట్టు సభ్యులని సమాచారం. .రెండు ముఠాల మధ్య నెలకొన్న భూ లావాదేవీలకు సంబంధించిన అంశమే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత ఆప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పుల్లో గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ తరహా కాల్పుల ఘటనను హేయకరమైన చర్యగా పలువురు ఫుట్ బాల్ క్రీడాకారులు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang violence  criminal gang  shooting  football  El Salvador  Latin America  

Other Articles