Indonesian Open: Saina Nehwal | Parupalli Kashyap | Srikanth | Hsu Ya Ching | Son Wan Ho

Indonesian open saina nehwal parupalli kashyap win srikanth out

Indonesian Open: Saina Nehwal and Parupalli Kashyap win; sports, Badminton, Indonesian open, Saina Nehwal, Parupalli Kashyap, Kidambi Srikanth, Hsu Ya Ching, Son Wan Ho, Ginting Anthony Indonesia

Saina Nehwal breezed past Chinese Taipei’s Hsu Ya Ching while Parupalli Kashyap stunned World No.5 Son Wan Ho in straight games to make it to the quarterfinals of the Indonesian Open Superseries badminton tournament.

ఇండోనేషియా ఓపెన్: సెమీస్ లోకి కశ్యప్, క్వార్టర్స్ లోకి సైనా

Posted: 06/05/2015 03:17 PM IST
Indonesian open saina nehwal parupalli kashyap win srikanth out

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సీరాస్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాణిస్తున్నారు. అటు పురుషుల సింగిల్స్ లో హైదరాబాదీ స్టార్ షెట్లర్, తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సంచలన విజయాన్ని నమోదు చేసి.. సత్తాచాటాడు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఆయన మెరుగైన ఆటతీరుతో సెమీస్ లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ  చాంపియన్, నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో కశ్యప్ 14-21, 21-17, 21-14 స్కోరుతో చెన్ లాంగ్పై విజయం సాధించాడు. తొలి గేమ్ కోల్పోయిన కశ్యప్ ఆ తర్వాత పుంజుకున్నాడు. వరసగా రెండు గేమ్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.

క్వార్టర్స్ లోనూ తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న సున్ వాన్ హోపై విజయాన్ని నమోదు చేశాడు. 21-11, 21-14 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించిన అతను క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. కశ్వఫ్ సున్ వాన్ హైతో ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో ఆత్యంతం అకట్టుకున్నాడు. ఇవాళ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ ను ఓడించి సెమీస్ లోకి చేరాడు. అటు మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ముందంజ వేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ నుంచి మూడో స్థానానికి పడిపోయిన సైనా.. ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో  21-13, 21-15 తేడాతో హు యా చింగ్‌పై విజయం సాధించింది. ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో ఆత్యంతం మ్యాచ్ పై పట్టుబిగించిన సైనా.. ప్రత్యర్థి  హు యా చింగ్‌పై కోలుకోనీయకుండా విజయం సాధించింది. కేవలం రెండు సెట్లలోనే  సైనా తన విజయాన్ని నమోదు చేసుకుని క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది.

కాగా  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. తన కంటే తక్కువ స్థానంలో ఉన్న స్థానిక ఆటగాడు గింటింగ్ ఆంథోనీతో తలపడిన శ్రీకాంత్ తీవ్రగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అతను 21-14, 20-22, 13-21 స్కోరుతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అటు పురుషులు, మహిళల డబుల్స్‌లో భారత్‌కు చుక్కదురైంది. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దివాల్కర్ జోడీ 13-21, 11-21 తేడాతో చయ్ బియావో, హాంగ్ వెయ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల డబుల్స్‌లో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప కూడా ఓటమిపాలయ్యారు. ఈ జోడీని యు యాంగ్, జాంగ్ కియాన్‌జిన్ జోడీ 21-8, 21-18 తేడాతో సులభంగానే ఓడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indonesian open  Saina Nehwal  Parupalli Kashyap  

Other Articles