italian judge orders maradona lawyer to stand trial | lawyer

Italian judge orders maradona lawyer to stand trial

italian judge orders maradona lawyer to stand trial, Diego Maradona, Angelo Pisano, Equitalia tax collection agency, Judge Chiara Giammarco, trial, Rome, Argentinian football legend Diego Maradona, Italy court, Football News

Argentinian football legend Diego Maradona and his lawyer Angelo Pisano will go on trial in Italy next year for slandering the Equitalia tax collection agency, a judge has ruled.

కోర్టు విచారణ ఎదుర్కోనున్న అర్జెంటినీ పుట్ బాల్ దిగ్గజం..

Posted: 05/14/2015 06:07 PM IST
Italian judge orders maradona lawyer to stand trial

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఈ మేరకు ఇవాళ ఇటలీలో కోర్టు న్యాయమూర్తి చ్యిరా గియామార్కో ఆయన తరపు న్యాయవాది ఆంగెలొ పిసానోకు స్పష్టం చేశారు. మారడోనా, అతడి తరపు లాయర్ ఆంగెలొ పిసానో వచ్చే ఏడాది జూలై 16న ఇటలీలోని రోమ్ న్యాయస్థానంలో విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈక్విటాలియా ట్యాక్స్ కలెక్షన్ ఏజెన్సీపై మారడోనా అరోపణలు గుప్పించిన కేసులో.. సదరు సంస్థ అతినిపై వేసిన కేసులో మరడోనాతో పాటుగా అతని న్యాయవాదిని కూడా తమ ఎదుట విచారణ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

ఈక్విటాలియాపై పన్ను వసూళ్ల ఏజెన్సీ తనకు అన్యాయం చేసిందని, నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తనపై భారీ మెత్తంతో డబ్బును వసూలు చేసిందని పలు ఇంటర్వ్యూల్లో మారడోనా దుమ్మెత్తి పోశాడు. ఈక్విటాలియా పన్ను వసూళ్ల ఏజెన్సీ తనను పీడించుకుని తిందని, అవకతవకలకు పాల్పడిందని విమర్శించాడు. ఇటలీలోని తన ఆస్తులను ఈక్విటాలియా స్తంభింపజేయడంతో మారడోనా ఈవిధంగా విరుచుకుపడ్డాడు. దీంతో తమను మారడోనా అనవసరంగా దూషించారని, అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో మారడోనా సహా అతని న్యాయవాదిని వచ్చే ఏడాది జులై 16న కోర్టు ఎదుట హాజరు కావాలని అదేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diego Maradona  Equitalia tax collection agency  football  

Other Articles