Football star Ronaldo ‘donates £5m’ to Nepal | foot ball | earth quake

Football star ronaldo donates 5m to nepal

Football star Ronaldo ‘donates £5m’ to Nepal, Real Madrid superstar Cristiano Ronaldo, Cristiano Ronaldo, Football star, Nepal, £5 million, Nepal earth quake, Nepal News, Online News from Nepal, Nepali News, Political, Science, Social, Sport, Ecomony, Business,Entertainment, Nepali Movie, Songs, Nepali Model, Actor,Audio, Video, Interview, Nepali Filmi News, Poems, Business news

Portugal and Real Madrid superstar Cristiano Ronaldo has reportedly donated £5 million (7 million euros) to help the aid effort following a devastating earthquake that jolted Nepal on April 25.

నేపాల్ బాధితులకు క్రిస్టియానో రోనాల్డో ఔదార్యం..

Posted: 05/10/2015 09:32 PM IST
Football star ronaldo donates 5m to nepal

ఫోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం, రియల్ మాడ్రిడ్ గా పేరోందిన క్రిస్టియానో రోనాల్డ్ అంటే వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా మక్కువ ఎక్కువ.  రోనాల్డో ఇటీవల ఓ మోడల్ తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తను చదువుతూ..ఓ టీవీ యాంకర్ ఏకంగా నగ్నంగా తయారై వార్తను చదివిందంటే.. అయనంటే ఎంత క్రేజో చెప్పనక్కర్లేదనుకుంటా. ఫుట్ బాల్ ఆటలో ప్రత్యర్థులకు ముచ్చమటు పట్టించి.. సునాయాసంగా బంతిని అవతలి వైపుకు తరలించి గోల్ చేయడం ఆయనకు అందవేసిన చెయ్యి. అయితే ఆటలోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన బహుచక్కని వ్యక్తి అని రుజువు చేయడానికి నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన.

భూతల స్వర్గం లాంటి నేపాల్ దేశం.. ఆకస్మికంగా వచ్చిన భూ ప్రళయానికి శవాల దిబ్బగా మారడంతో ఒకటి రెండు కాదు ప్రపంచ దేశాలన్ని భీతిల్లిపోయాయి. నేపాల్ మృతుల సంఖ్య ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే వుండగా, సుమారుగా 15 వేలకు చేరవచ్చని నేపాల్ ప్రధాని సుషీల్ కోయిరాల అవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్ని తమకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్న ఆయన పిలుపు మేరకు కొన్ని దేశాలు సాయాన్ని ప్రకటించాయి. కాగా భూప్రళయం సంభవించడంతోనే భారత్ నేపాల్ భూభాగంలోకి వెళ్లి సహాయ కార్యక్రమాలను అందించింది.

అయితే వ్యక్తిగతంగా క్రీడాకారులెందరో చెల్లించి పోయినా.. ఈ ఫుల్ బాల్ దిగ్గజం రోనాల్డో మాత్రం అందరికన్నా ముందుగా తన ఔదార్యన్ని కనబబర్చారు. ఒకటి రెండు కాదు ఏకంగా 50 లక్షల బ్రీటీష్ పాండ్లను నేపాల్ బాదితుల కోసం ఆర్థిక సాయం అందించారు. వాటి విలువ మన దేశీయ కరెన్సీలో లెక్కిస్తే..సుమారు 50 కోట్ల రూపాయలు. ఈ ఘటన  క్రిస్టానో రోనాల్డో.. ఔదర్యంలో ఎంత గోప్పవాడో చాటిచెబుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cristiano Ronaldo  Football star  Nepal  £5 million  Nepal earth quake  

Other Articles