Saina Nehwal Withdraws From Singapore Open, Not Upset at Losing World No. 1 Ranking

Saina sindhu skips singapore open srikanth leads indian charge

Saina skips Singapore Open, Srikanth leads Indian charge, Saina not Upset at Losing World No. 1 Rank, Saina lost Malaysia Open semifinals, Badminton, Saina Nehwal, Li Xuerui, Malaysia Open,Malaysia Open Super Series Premier., Xue Yao, Saina Nehwal, Malaysia Open, Chinese qualifier Xue Yao, pv sindhu misses singapore open, kadambi srikanth to lead india in singapore open

A tired Saina Nehwal has pulled out of this week's Singapore Open where she was the top seed. This means she has lost an opportunity to regain her world No. 1 ranking that she lost in Malaysia last week. But then Saina is not worried about rankings.

మలేషియా ఓపెన్ సీరీస్ సెమీఫైన్సల్స్ లో ఓడిన సైనా నెహ్వాల్

Posted: 04/07/2015 01:35 PM IST
Saina sindhu skips singapore open srikanth leads indian charge

ప్రపంచ బ్యాట్మింటన్ లో తన అత్యత్తమ ప్రతిభతో చరిత్రను తిరగరాసిన నెంబర్ వన్ కిరీటాన్ని అధిరోంహిచిన భారతీయ ఏస్ షెట్లర్ సైనా నేహ్వాల్.. కొద్ది రోజుల్లోనే జరిగిన మలేషియా ఓపెన్ లో తన ర్యాంకును జారవిడుతుకుంది. ఇప్పుడు మరోమారు తన ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును అందుకునే అవకాశం సింగపూర్ ఓపెన్ టోర్నమెంటు ద్వారా వచ్చినా..  తాను దానికి దూరంగా వుండలాని నిర్ణయించుకుంది. అయితే ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించితీరుతానని అమె ధీమా వ్యక్తం చేసింది. భారతీయ బ్యాట్మింటన్ అభిమానులు సహా తన అభిమానులకు కూడా ఈ విషయంలో తనకు మద్దతును అందజేయాలని కోరింది.

గత నెలలో మూడు టోర్నమెంట్లు ఆడాననీ తెలిపింది. అందులో రెండింటిలో ఫైనల్స్ వరకు చేరుకున్నానని.. ఒకటి గెలిచానని చెప్పింది. వరుస టోర్నమెంట్ల వల్ల తనకు విశ్రాంతి దొరకడం లేదనీ.. అందుకే సింగపూర్ ఓపెన్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు సైనా తెలిపింది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని ఆసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మెరుగ్గా ఆడాలనుకుంటున్నట్లు సైనా వెల్లడించింది. కాగా, మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా సింగపూర్ ఓపెన్ టైటిల్ కోసం పోటీ పడటం లేదు. గాయం కారణంగా ఆమె సింగపూర్ ఓపెన్‌కు దూరమయ్యారు. దీంతో భారత బ్యాడ్మింటన్ జట్టుకు కదంబి శ్రీకాంత్ నాయకత్వం వహించనున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  singapore Open  Badminton  

Other Articles