Saina Nehwal loses top spot in rankings after Malaysia Open semifinals defeat to Li Xuerui

Saina nehwal lost malaysia open semifinals

Saina Nehwal losses Malaysia Open semifinals, Saina lost Malaysia Open semifinals, Badminton, Saina Nehwal, Li Xuerui, Malaysia Open,Malaysia Open Super Series Premier., Xue Yao, Saina Nehwal, Malaysia Open, Chinese qualifier Xue Yao

Saina Nehwal lost her World No 1 ranking following her semifinal defeat against China’s Olympic champion Li Xuerui in the Malaysia Open Super Series Premier.

మలేషియా ఓపెన్ సీరీస్ సెమీఫైన్సల్స్ లో ఓడిన సైనా నెహ్వాల్

Posted: 04/04/2015 01:10 PM IST
Saina nehwal lost malaysia open semifinals

ప్రపంచ బ్యాట్మింటన్ లో తన అత్యత్తమ ప్రతిభతో చరిత్రను తిరగరాసిన నెంబర్ వన్ కిరీటాన్ని అధిరోంహిచిన భారతీయ ఏస్ షెట్లర్ సైనా నేహ్వాల్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఇవాళ జరిగిన మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీ పైన్సల్స్ లో సైనా పరాజయం పాలైంది. మలేషియాలోని కౌలాలంపూర్ లో జరుగుతున్న మలేషియా ఓపెన్ టోర్నమెంటు మహిళల సింగిల్స్ విభాగంలో చైనా క్రీడాకారిణి లీ జ్యూరీ చేతిలో ఓటమి పాలై నిష్క్రమించింది.  

మలేషియా ఓపెన్ టోర్నమెంటు మహిళల సింగిల్స్ విభాగంలో చైనా క్రీడాకారిణి, అన్ సీడెడ్ సన్ యూను అతి కష్టం మీద ఓడించి సెమీఫైనల్స్లోకి వచ్చిన సైనా.. ఊహించినట్టుగానే పరాజయం పాలైంది. లీ జ్యూరీ చేతిలో 13 21, 21 17, 22 20 స్కోరుతో పోరాడి ఓడింది. కాగా, మరో సెమీ ఫైనల్ లో తలపడుతున్న కారోలినా మరిన్, వాంగ్ షాయాక్సన్ లలో విజేతతో లీ జ్యూరీ ఫైనల్ లో తలపడనుంది. గతంలోనూ లీ జ్యూరీ చేతిలో ఎనమిది పర్యాయాలు ఓడిన సైనాను అదే అభద్రతా భావం వెంటాడింది. కాగా సైనా కూడా లీజ్యూరీపై రెండు పర్యాయాలు (2010 సింగపూర్ ఓపెన్, 2012 ఇండోనేషియా ఓపెన్లో) విజయాన్ని సాదించింది. ముచ్చటగా మూడో పర్యాయం కూడా విజయాన్ని సాధిస్తుందని నిరీక్షించిన అభిమానులకు సైనా నిరాశను మిగిల్చింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  Malaysia Open  Badminton  Li Xuerui  

Other Articles