Mary kom to be brand ambassador of north east to promote region

mary kom to be brand ambassador, mary kom brand ambassador of north east, mary kom to promote north eastern region, olympic gold medalist mary kom, boxer M.C. Mary Kom, doner,

sources say, centre to appoint olympic gold medalist mary kom as brand ambassador of north east to promote region

మేరికోమ్ ను వరించనున్న మరో అరుదైన గౌరవం..

Posted: 03/15/2015 08:38 PM IST
Mary kom to be brand ambassador of north east to promote region

ఒలంపిక్స్ సర్ణ పతక విజేత, బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్‌కు మరో అరుదైన కీర్తి కిరీటం దక్కనుంది. త్వరలో బాక్సింగ్ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన మేరికామ్ ను ఈశాన్య రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందకు కేంద్ర యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు సంకేతాలను ఇచ్చారు. డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (డోనర్) నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాలు సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాల ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సారథ్యంలో నడుస్తున్న ఈ డొనర్ కమిటీ ఈ మేరకు బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలని నిర్ణయించింది.

ఇందుకు వారు ప్రతిపాదించిన ఒకే ఒక్క పేరు మేరి కోమ్ కావడం గమనార్హం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. మణిపూర్‌కు చెందిన 32ఏళ్ల మేరీ కోమ్ బాక్సింగ్‌లో ఇప్పటివరకు ఐదు ప్రపంచ టైటిళ్లను, ఒక ఒలంపిక్ పతకాన్ని గెలుచుకున్నారు. వచ్చే ఏడాది రియోడిజనరియోలో జరగనున్న ఒలంపిక్స్ గేమ్స్ అనంతరం తాను బాక్సింగ్ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిడంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mary kom  brand ambassador  north east  doner  

Other Articles