Telugu girl pratyusha won in world junior chess tournament where harika loses in poker chess tournament

chess pratyusha, chess harika, dronavalli harika latest news, bodda pratyusha latest news, bodda pratyusha dronavalli harika news, abhijit gupta news, praneet surya news

telugu girl pratyusha won in world junior chess tournament where harika loses in poker chess tournament

సీనియర్ క్రీడాకారిణిని అవమానపరిచిన జూనియర్!

Posted: 10/08/2014 02:42 PM IST
Telugu girl pratyusha won in world junior chess tournament where harika loses in poker chess tournament

ఈమధ్య కాలంలో మహిళల క్రీడాకారిణుల మధ్య విభేదాలు ఎక్కువవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తన సీనియర్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! తనకు, సైనాకు మధ్య అంత ఎక్కువ స్నేహబంధం లేదని, కేవలం హాయ్ - బాయ్ చెప్పుకోవడం వరకే ఒకర్నొకరు పలకరించుకుంటామని తెలిసింది. వీరిద్దరు కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సందర్భాలూ ఎక్కువగానే వున్నా.. తమ మధ్య ఎటువంటి బంధం లేదని సింధు సంచలనం రేపింది. అలాగే చెస్ క్రీడాకారిణుల మధ్య కూడా విభేదాలు వున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. చెస్ ఆటలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న ద్రోణవల్లి హారికను జూనియర్ ప్రత్యూష అవమానపరిచిందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే వీరిమధ్య విభేదాలున్నది వ్యక్తిగతంగా కాదులెండి... ఆట నేపథ్యంలో ప్రత్యూష అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి, హారికను వెనుక నెట్టేసింది.

ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో తెలుగుతేజం బొడ్డా ప్రత్యూష విజయం సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. బాలికల విభాగంలోని రెండో రౌండ్లో ప్రత్యూష.. సబినా ఇబ్రహియోవా (అజైర్ బైజాన్)ను ఓడించింది. ఈ విజయంతో ప్రత్యూష 2 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ద్రోణవల్లి హారిక పోకర్ చెస్ టోర్నమెంట్లో ఓటమి చవిచూసింది. మొదట్లో అద్భుతంగా ప్రదర్శించి ప్రత్యర్థిని ముచ్చెమటలు పెట్టించిన హారిక... మూడో రౌండ్లో మాత్రం మేరీ అలెస్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఒకవైపు జూనియర్ తెలుగుతేజం విజయం సాధిస్తే.. మరోవైపు సీనియర్ క్రీడాకారిణి అయిన హారిక ఓడిపోవడంతో ఈమెకు అవమానం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా... జూనియర్ చెస్ టోర్నమెంట్లో ని పురుషుల విభాగంలో ప్రణీత్ సూర్య రెండో రౌండ్లో.. పోకర్ చెస్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో అభిజిత్ గుప్తా మూడో రౌండ్లో ఘోరంగా ఓటమి చవిచూశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bodda pratyusha  dronavalli harika  chess tournament  abhijit gupta  praneet surya  

Other Articles