Indian kabaddi team to face iran in asian gemes finals

asian games, asian games schedule, asian games indian players, asian games indian athletics, indian athlets, latest news, sports news, asian games ending cermony, asian games starting cermony, asian games latest news, asian games live, asian games latest updates, kabaddi, indian kabaddi team, kabaddi matches, indian games, iran, iran kabaddi team, iran kabaddi team players, indian kabaddi team players

indian kabaddi team of men and women to face final match with iran teams of men and women : co incidentally indian kabaddi teams of men and women has finals with iran men and women team wants to continue its victory record

కబడ్డీ రికార్డుల కలలు.. ఈ సారి డబుల్ ధమాకా

Posted: 10/02/2014 01:02 PM IST
Indian kabaddi team to face iran in asian gemes finals

ఆసియా గేమ్స్ లో పరాజయం అంటే తెలియని భారత కబడ్డి జట్టు మరోసారి తుది సమరానికి సిద్దం అవుతోంది. బంగారు పతకం సాధించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆసియా గేమ్స్ లో విజయాల రికార్డును కొనసాగిస్తున్న భారత కబడ్డి జట్టు మరోసారి గెలుపు దిశగా కూత పెడుతుంది. ఈ సారి ఒక్కటి కాదు రెండు పతకాలు సాధించాలని టీమ్ ఇండియా ఉవ్విళ్ళూరుతోంది. పురుషులు తుది సమరానికి సై అంటే.., మహిళలు కూడా పంతం నీదా నాదా అంటూ పోటికి సిద్ధమవుతున్నారు.

ఆసియా గేమ్స్ లో భారత కబడ్డి జట్టుకు పరాజయం అంటే అంతగా పరిచయం లేదు. ఎందుకంటే 1990 నుంచి జరుగుతున్న అన్ని ఆసియా గేమ్స్ లో కబడ్డి జట్టు బంగారు పతకం సాధిస్తూ వస్తోంది. పాతికేళ్ళుగా ఆసియా గేమ్స్ లో కబడ్డికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. విక్టరీ సింబల్ గా ఇండియా టీం నిలబడింది. ఈ సారి కూడా అదే ఊపుతో ఫైనల్ కు చేరింది. అక్టోబర్ 3న శుక్రవారం రోజు దేశానికి దసరా కానుకగా బంగారు పతకం తేవాలని ఆటగాళ్ళంతా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ లో ఇరాన్ పురుషుల కబడ్డి జట్టుతో భారత పురషుల కబడ్డి జట్టు తలపడనుంది.

ఇక మహిళలు కూడా ఏమి తక్కువ తీసిపోలేదు అన్నట్లుగా ప్రతిభ చూపిస్తున్నారు. ఆసియా గేమ్స్ లో ఇండియా ఉమెన్స్ కబడ్డి టీం కూడా పైనల్ కు చేరింది. సెమీస్ లో థాయ్ లాండ్ జట్టును ఓడించి తుది సమరానికి సిద్దమని సవాల్ విసురుతున్నారు. ఇక్కడ యాదృశ్చికంగా భారత పురుషుల, మహిళల కబడ్డి జట్లు ఫైనల్ లో ఇరాన్ పురుషుల, మహిళల కబడ్డి జట్లతో తలపడనున్నాయి. రెండు దేశాలు నాలుగు టీంల మద్య జరిగే మ్యాచ్ లో భారత్ కు రెండు బంగారు పతకాలతో డబుల్ ధమాకా తీసుకొస్తామని రెండు టీంలు అంటున్నాయి. వీరి మాటలు నిజం కావాలని..,ఫైనల్ లో భారత కబడ్డీ జట్లు రెండు గెలవాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  kabaddi  sports news  latest news  

Other Articles