Gutta jwala out from asia badminton games due to her knee pain

gutta jwala, gutta jwala latest news, gutta jwala aisa games, gutta jwala hospitalised, gutta jwala aisa games news, gutta jwala hot photos, aisa games 2014

gutta jwala out from asia badminton games due to her knee pain

గుత్తాజ్వాలకు ఆ నొప్పి బాధ కలిగిస్తోందట!

Posted: 09/10/2014 01:58 PM IST
Gutta jwala out from asia badminton games due to her knee pain

(Image source from: gutta jwala out from asia badminton games due to her knee pain)

తెలుగుతేజం బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల గతకొన్నిరోజుల నుంచి ఎక్కడ వుందో..? ఎలా వుందో..? తెలియడం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు బహుమానాలు ఇచ్చిన నేపథ్యంలో తప్ప.. గుత్తాజ్వాల మరెప్పుడూ తెరమీద కనిపించలేదు. ఇంతలోనే సైనా నెహ్వాల్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టే చేసి.. మళ్లీ కనుమరుగైపోయింది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు మళ్లీ తెరమీదకు వచ్చింది. కానీ ఈసారి తాను మునుపటిలా హుషారుగా కాకుండా.. చాలా డల్ గా, నీరసంగా కనిపించడంతో తనకు ఏం జరిగిందోనన్న సందేహంలో పడిపోయారు.

గతకొన్ని రోజుల నుంచి ఈ అమ్మడు అనుకోకుండా జరిగిన ఘటన నేపథ్యంలో మోకాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంది. అయితే ఆ నొప్పి రానరాను విపరీతంగా వేధిస్తుండటంతో ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలంటూ వైద్యలు ఆమెను సూచించినట్లు తెలుపుతున్నారు. దీంతో ఈ అమ్మడు ఆసియా క్రీడల నుంచి వైదొలగింది. తనకు నొప్పి తీవ్రం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు ఇంకా రెండువారాపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుంది కాబట్టి.. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ నుంచి వైదొలగక తప్పలేదు.

ఈ విషయంపై జ్వాల మాట్లాడుతూ.. ‘‘ఆసియా క్రీడల కోసం శిక్షణ ఆరంభించాక మోకాలి నొప్పి మొదలైంది. దీంతో వైద్యపరీక్షలు చేయించుకుంటే, అందుకు డాక్టర్లు కనీసం 10-12 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా క్రీడల నుంచి తప్పుకోవడం మినహా మరో మార్గం కనిపించలేదు. ఇలా వైదొలగడం నాకు చాలా బాధగా వుంది. నా కెరీర్లో గాయం కారణంగానే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందిగానీ.. మునుపెన్నడూ ఇలా చేయలేదు’’ అటూ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇదిలావుండగా.. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరగనున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gutta jwala  asia games 2014  indian badminton players  

Other Articles