Sachin and anushka to attend pvps quare multiplex

Sachin tendulkar and anushka shetty to attend pvp square multiplex opening ceremony in vijayawada, sachin tendulkar latest news, anushka shetty latest news, sachin tendulkar with anushka shetty, anushka shetty with sachin tendulkar, sachin tendulkar with anushka shetty in vijayawada, sachin tendulkar at pvp square opening ceremony, anushka shetty at pvp opening ceremony, anushka shetty and sachin at pvp opening ceremony

Sachin tendulkar and anushka shetty to attend pvp square multiplex opening ceremony in vijayawada

బెజవాడలో అనుష్కతో బ్యాటింగ్ చేయనున్న సచిన్!

Posted: 07/30/2014 06:42 PM IST
Sachin and anushka to attend pvps quare multiplex

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ బొమ్మాళి అనుష్కతో కలిసి విజయవాడలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇందుకు ఇద్దరూ తమతమ అంగీకారాలను కూడా తెలిపారు. అయితే ఇక్కడ బ్యాటింగ్ అంటే మరోరకంగా ఆలోచించుకోకండి... ఒక ఫంక్షన్ నిమిత్తం వీరిద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. విజయవాడలో పివిపికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత ఒకరు ‘‘పివిపి స్క్వేర్’’ అనే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ ను నిర్మించిన సందర్భంలో.. దీని ప్రారంభోత్సవం కోసం వీరిద్దరి ఆయన ఆగస్టు 1వ తేదీన ఆహ్వానించారు.

అయితే సచిన్ లాంటి దిగ్గజం ఇలా పివిపికి సంబంధించిన వారికోసం ఒక షాపింగ్ మాల్ ను ఓపెన్ చేయడానికి రావడానికి గల కారణమేంటా..? అని ఆలోచనల్లో మునిగిపోయినవారు ఆరా తీస్తే... ప్రముఖ వ్యాపారవర్గాల్లో సచిన్ కు, పివిపికి సాన్నిహిత్యం వున్న కారణంగానే ఆయన ఈ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే అనుష్క మాత్రం ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. గతంలో అనుష్క లీడ్ రోల్ లో పివిపి నిర్మించిన ‘‘వర్ణ’’ సినిమా డిజాస్టర్ ను మిగిల్చిన నేపథ్యంలో.. ఆ నష్టాన్ని పూరించడానికి అనుష్క ఇక్కడికి వస్తున్నట్లు కొంతమంది విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

ఏదిఏమైనా.. ఒకవైపు క్రికెట్ దిగ్గజం, మరోవైపు సెక్సీ అందాల భామ ఒకే వేదికమీద కనువిందు చేయనున్నారని తెలుసుకున్న అభిమానులు వీరి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 1వ తేదీని జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరిద్దరితో పాటు సినిమా, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అయితే సచిన్ తో అనుష్క ఈ వేడుకలో పాల్గొంటున్న సందర్భంలో... విజయవాడలో అనుష్కతో సచిన్ బ్యాటింగ్ చేయనున్నాడని కొంతమంది సెటైర్లు కూడా వేసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles