Ian chappel controversial comments on mahendar singh dhoni

ian chappel controversial comments on Mahendar Singh Dhoni, australian former captain iam chappel, ian chappel comments on dhoni, mahendar singh dhoni latest news, ian chappel latest news, ian chappel comments on dhoni, ian chappel comments on virat kohli, ian chappel says dhoni is not corret for captainship

ian chappel controversial comments on Mahendar Singh Dhoni

భారత్ జట్టు కెప్టెన్ గా ధోనీ పనికిరాడా..?

Posted: 07/15/2014 11:30 AM IST
Ian chappel controversial comments on mahendar singh dhoni

28 సంవత్సరాల తరువాత భారతదేశ కలలను సాకారం చేస్తూ, వరల్డ్ కప్ ను స్వాధీనం చేసుకున్న భారత కెప్టెన్ ధోనీ మీద ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. స్టార్ క్రికెట్ ఆటగాళ్ల నుంచి అభిమానుల వరకు ధోనీకి వ్యతిరేకంగా ప్రాచారాలు చేయడం మొదలుపెట్టేశారు. ఇటువంటి వార్తలపై కొంతమంది విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన ధోనీలాంటి కెప్టెన్ మీద విమర్శలు చేయడానికి కారణం అతని వ్యవహారాశైలిలో రానురాను చాలా మార్పులొచ్చాయని, గతంలో ధోనీ ప్రదర్శించిన అనుభవం ఇప్పుడు లేదని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన ఇయాన్ చాపెల్ కూడా ధోనీ మీద విరుచుకుపడినట్లు ఘాటు కామెంట్లు చేశాడు. టెస్ట్ మ్యాచల నుంచి కెప్టెన్ గా ధోనీని తీసేసి, అతని స్థానంలో యువసంచలనం అయిన విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సిందిగా చాపెల్ చెప్పాడు. అలాగే ధోనీ కేవలం పరిమితం ఓవర్ల క్రికెట్ కు మాత్రమే అద్భుత నాయకత్వాన్ని వహించి జట్టును విజయబాటవైపు తీసుకుళ్తాడని కితాబిస్తూనే.. టెస్ట్ క్రికెట్ మ్యాచులకు మాత్రం ధోనీ సరైన నాయకుడు కాడంటూ స్పష్టం చేశాడు.

27 ఏళ్ల వయసున్న కోహ్లీ మ్యాచులలో అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడని, సంచలనాల విజయాలను సృష్టిస్తున్నాడని చెప్పిన చాపెల్... కోహ్లీకి జట్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే సరైన సమయం ఇదేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జోష్ లో వున్న యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇస్తే.. వారు కూడా తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం వుంటుందని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం భారతదేశ క్రికెట్ జట్టును నడిపించడానికి ధోనీకాకుండా అతని స్థానంలో కోహ్లీ లాంటి యువకునికి నాయకత్వం ఇవ్వడం అవసరమని ఆయన వెల్లడించారు. ఏదేమైనా.. ఈ మధ్యకాలంలో మాత్రం ధోనీకి వ్యతిరేక గాలులు చాలా ఎక్కువయ్యాయి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles