France enters in quarter finals by beating nigeria with 2 0 goals

France enters in quarter finals by beating nigeria with 2-0 goals, france enters in quarter finals, france vs nigeria match, fifa world cup 2014 news, 2014 fifa world cup, fifa world cup latest news, fifa world cup matches, quarter final matches of fifa world cup

France enters in quarter finals by beating nigeria with 2-0 goals

నైజీరియాకు మాంచి కిక్కిచ్చిన ఫ్రాన్స్ జట్టు

Posted: 07/01/2014 01:50 PM IST
France enters in quarter finals by beating nigeria with 2 0 goals

(Image source from: France enters in quarter finals by beating nigeria with 2-0 goals)

మాజీ ఛాంపియన్ గా పేరు తెచ్చుకున్న ఫ్రాన్స్ జట్టు... ఈసారి సాకర్ ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటినుంచి ఈ జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే వుండేది. దీంతో ఈ జట్టు మీద ఎవరూ అంతగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఫ్రాన్స్ ఆటగాళ్లు మాత్రం తన అద్భుతమైన ప్రదర్శనతో తమ జట్టును క్వార్టర్ ఫైనల్ కు తీసుకెళ్లారు. సోమవారం జరిగిన మ్యాచ్ లో 2-0 స్కోరుతో నైజీరియాకు చుక్కలు చూపించేవిధంగా సునాయాసంగా విజయాన్ని దక్కించుకుంది.

మ్యాచ్ మొదలైన ఆరంభంలో నైజీరియా జట్టు ఫ్రాన్స్ ను బాగానే అడ్డుకుంది. బంతిని తమ అధీనంలోనే వుంచుకుని ఫ్రాన్స్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. 19వ నిముషంలో నైజీరియా గోల్ వేయడానికి ప్రయత్నించగా అది ఆఫ్ సైడ్ గోలైంది. వీరికి ధీటుగానే సమాధానం చెబుతూ నైజీరియా డిఫెన్స్ లోకి చొచ్చుకుంటూ వెళ్లిన పోగ్బా.. గోల్ వేసేందుకు బంతిని చాలా బలంగా కొట్టాడు. కానీ నైజీరియా గోల్ కీపర్ ఎవెన్యూ దానిని తనదైన శైలిలో అడ్డుకున్నాడు. దీంతో ఫ్రాన్స్ ఇక తన దూకుడును పెంచి, నైజీరియాకు చుక్కలు చూపించడం ప్రారంభించింది.

ఫ్రాన్స్ గోల్ సాధించడానికి అనేకసార్లు ప్రత్యర్తి డిఫెన్స్ లోకి దూసుకెళ్లింది. నైజీరియా మాంచి కిక్కించేలా గోల్ వైపుకు దూసుకుపోయినా.. నైజీరియా ఆటగాళ్లు వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. నైజీరియాకు కూడా గోల్ వేయడానికి అవకాశాలు వచ్చినా... వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫ్రాన్స్ ఆటగాడు అయిన వాల్బెనా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. గోల్ కు అతీసమీపంగా వెళ్లిన అతగాడు... ఉత్సాహంతో షాట్ ను గట్టిగా కొట్టడం వల్ల బంతి గోల్ కు దూరంగా బయటికి వెళ్లింది. ఆ తరువాత ఇరుజట్ల పరిస్థితులు పూర్తిగా మారిపొయ్యాయి.

70వ నిముషంలో ఫ్రాన్స్ కి గోల్ కొట్టే అవకాశం వచ్చినా.. గోల్ కీపర్ దానిని అడ్డుకున్నాడు. 78వ నిముషంలో జెంజెమా హెడర్ ను, ఎన్యెనూపైకి ఎగురుతూ అద్భుతంగా అడ్డుకున్నాడు. కానీ ఆ సంతోషం చాలాసేపటి వరకు నిలవలేకపోయింది. తర్వాతి నిముషంలో ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా హెడర్ గోల్ తో టీంను ఆధిక్యానికి తీసుకెళ్లాడు. వాల్బెనా కార్నర్ ను ఎన్యెమా అడ్డుకోగా.. బంతి అతని నుంచి పోగ్బా దగ్గరకు వెళ్లింది. దాంతో అతను సర్వసాధారణంగా గోల్ వేశాడు. ఆ తరువాత 91వ నిముషంలో జోసెఫ్ యోబో సెల్ఫ్ గోల్ తో బాధను కొనితెచ్చుకుంది. జెంజెమా కొట్టిన బంతిని అడ్డుకోబోయిన యోమో తనే గోల్ పోస్టులోకి తన్ని.. ఫ్రాన్స్ కు విజయాన్ని అందించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles