ఫిపా వరల్డ్ కప్ 2014లో తాజాగా జరిగిన రెండు మ్యాచుల్లోనూ భారీ జట్లుగా పిలువబడే మెక్సికో, బ్రెజిల్ లు సునాయాసంగా విజయాలను దక్కించుకున్నాయి. మొదటి నుంచే తమతమ స్థానాల్లో నిలకడగా ఆడుకుంటూ దూసుకుపోతున్న ఈ రెండు జట్లు సులువుగా ఆటను ముగించాయి. గ్రూప్-ఏ విభాగంలో జరిగిన రెండు మ్యాచుల్లో బ్రెజిల్ జట్టు కామెరూన్ పై, మెక్సికో జట్టు క్రొయేషియాపై విజయాలు సాధించాయి. అలాగే గ్రూప్-బిలో జరిగిన రెండు మ్యాచుల్లో నెదర్లాండ్స్ జట్టు చిలీపై విజయం సాధించి ముందజలో నిలిచింది. ఇక స్పెయిన్ కూడా ఆస్ట్రేలియాను చిత్తుచేసి, చివరిసారిగా తన పరువును నిలబెట్టుకుంది.
గ్రూప్ - ఏ:
బ్రెజిల్ - కామెరూన్ మ్యాచ్ :
కామెరూన్ జట్టుతో తలపడిన బ్రెజిల్ టీమ్.. మొదటి నుంచే ఆ జట్టుకు చుక్కలు చూపిస్తూ విశ్వరూపం ప్రదర్శించింది. బ్రెజిల్ ఆటగాళ్లు చాలాసమయం వరకు బంతిని తమ దగ్గరే వుంచుకుని, కామెరూన్ ఆటగాళ్లకు చిక్కనివ్వకుండా చేశారు. పరస్పరం గోల్ కోసం చాలాసార్లు దాడులు చేసుకున్నారు. అయితే కామెరూన్ టీం నుంచి మాటివ్ అనే ఆటగాడు కేవలం ఒక గోల్ మాత్రమే సాధించగా.. బ్రెజిల్ క్రీడాకారుల్లో నెయ్ మార్ రెండు, ఫ్రెండ్ - ఫెర్నాడిన్హో చెరో గోల్ సాధించారు. దీంతో బ్రెజిల్ 4-1 ఆధిక్యంతో మ్యాచ్ ను విజయవంతంగా ముగించేసింది.
మెక్సికో - క్రొయేషియా మ్యాచ్ :
మెక్సికో - క్రొమేషియా మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మొదట్లో క్రొయేషియా జట్టు ఆటగాళ్లు చెలరేగిపోయి తన ప్రతిభను ప్రదర్శిస్తే... మెక్సికో ఆటగాళ్లు చివర్లో విజృంభించారు. ప్రతమార్థంలో ఒకరికొకరు పరస్పరం గోల్స్ చేయనివ్వకుండా రక్షణాత్మకంగా ఆడితే.. ద్వితీయార్థంలో చెలరేగిపోయి ఆడారు. మెక్సికో ఆటగాళ్లు చివర్లో ఒక్కొక్కరు ఒకేసారి మూడు గోల్స్ సాధించి విజయాలవైపు దూసుకుపోయారు. అందులో మార్కజ్ 72వ నిముషంలో, అగొర్డాడో 75వ నిముషంలో, హెర్నాండెజ్ 82వ నిముషంలో వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ సాధించారు. క్రొయేషియా జట్టు నుంచి పెరీసిక్ అనే ఆటగాడు చివర్లో 87వ నిముషంలో కేవలం ఒకే ఒక గోల్ సాధించాడు. దీంతో మెక్కికో 3-1 తేడాతో సాహసోపేతమైన విజయం సాధించి, అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేసింది.
గ్రూప్ - బి :
నెదర్లాండ్స్ - చిలీ మ్యాచ్ :
నెదర్లాండ్స్ - చిలీ మధ్య జరిగిన మ్యాచ్ చాలా సునాయాసంగానే ముగిసింది. చిలీ జట్టు ఆటగాళ్లు అంతగా తమ ప్రతిభను ప్రదర్శించుకోలేకపోయారు. నెదర్లాండ్స్ లో ఫెర్, మెంఫాస్ ఆటగాళ్లు చెరొకటి గోల్ చేయడంతో 2-0 ఆధిక్యంతో గెలుపొందింది.
స్పెయిన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ :
స్పెయిన్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ ఘన విజయం సాధించి తన పరువును నిలబెట్టుకుంది. వరుస పరాజయాలతో నాకౌట్ ఆశలను దూరం చేసుకున్న స్పెయిన్, ఆస్ట్రేలియాతో తలపడిన మ్యాచ్ తో గౌరవాన్ని కాపాడుకోగలిగింది. స్పెయిన్ జట్టులోని విల్లా, టొరెస్, జువాన్ మటాలు చెరొక గోల్స్ వేసి తమ జట్టును విజయబాటవైపుకు తీసుకెళ్లారు. దీంతో ఆ జట్టు 3-0 ఆధిక్యంతో విజయం సాధించి, గ్రూప్ - బి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more