Star india group to invest 1500 crore in hockey

Star India, Star India hockey, Star India hockey news, Star Sports, Star Sports HIL, Star Sports investment in HIL, Indian Sports broadcaster, Hockey India League,

India country leading sports network Star Sports, today committed to invest in excess of Rs 1,500 crore in hockey.

హాకీ కోసం స్టార్ గ్రూప్ నడుం బిగించింది

Posted: 01/24/2014 11:35 AM IST
Star india group to invest 1500 crore in hockey

మన దేశంలో అంత్యంత ప్రాచుర్యం పొందిన ఆట క్రికెట్. క్రికెట్ కి ఉన్నంత ఆదరణ ఏ క్రీడలకు ఉండదు. మన దేశపు జాతీయ క్రీడగా పేరుతెచ్చుకున్న హాకీకి మనదేశంలో ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. దానికి నిధులు, సౌకర్యాలు కూడా తక్కువే. ఒకప్పుడు ఒలంపిక్స్ స్వర్ణాలు సాధించిన మన హాకీ జట్టుకు కళ తప్పి పోయి, దానికి ఆదరణ కూడా తగ్గింది.

దీంతో అన్ని క్రీడలకు ధీటుగా హాకీని పాపులర్ చేసేందుకు ప్రముఖ ప్రసార సంస్థ అయిన స్టార్ ఇండియా గ్రూప్ నడుం బిగించి, రానున్న ఎమిదేళ్ళలో ఈ ఆట పై భారీ పెట్టుబడి దాదాపు 1500 కోట్లను పెట్టేందుకు సిద్దం అయింది. భారత్ లో హాకీ కి మరింత వన్నె తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్టార్ ఇండియా బిజినెస్ హెడ్ తెలిపారు.  స్థానిక లీగ్స్, అంతర్జాతీయ ఈవెంట్స్, 2018లో హాకీ ప్రపంచకప్ ద్వారా అభిమానులకు ఈ ఆట మరింత చేరువయ్యేందుకు క్రుషి చేస్తామని తెలిపారు.

ఇందులో భాగంగా రేపటి నుండి జరిగే హాకీ ఇండియా లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు  ఈ మ్యాచ్‌లను ప్రసారం చేసే స్టార్ ఇండియా గ్రూప్ రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. హాకీ చరిత్రలోనే తొలిసారిగా మ్యాచ్ సందర్భంగా 20 కెమెరాలను ఉపయోగించనుంది. స్టార్ స్పోర్ట్స్ 3 ద్వారా హిందీ కామెంటరీతో కూడా మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. స్టార్ గ్రూప్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలీ క్రుతం అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles