పట్టుదల ఉంటే వయస్సు అడ్డంకి కాదు అని నిరూపిస్తుంది అమెరికా నల్లుకలువ భామ సెరెనా విలియమ్స్. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో మూడు పదుల వయస్సు దాటినా నాలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదు అని నిరూపిస్తుంది. ఈ యూఎస్ ఓపెన్ లో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడుతూ టైటిల్ కి రెండు అడుగుల దూరంలో నిలిచిన ఈ భామ నిన్న క్వార్టర్ ఫైనల్లో కార్లా నవారోతో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించి సెమీస్ కి దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా 6-0, 6-0తో 18వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)ను చిత్తు చేసింది. కేవలం 52 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. పదునైన సర్వీస్లకుతోడు శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో చెలరేగిపోయిన సెరెనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ టాప్ సీడ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 20 విన్నర్ షాట్స్‌ను నమోదు చేసింది. గత కొన్ని రోజులుగా సంచలనాలు నమోదు చేయని సెరెనా ఈ యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర స్రుష్టిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more