Indian Cricket allrounder replaces Ali Khan in USA squad అమెరికా తరఫున అరంగ్రేటం చేయనున్న ఏపీ క్రికెటర్..

Former india under 19 allrounder d siva kumar replaces ali khan in usa squad

Former India Under-19 allrounder, D Siva Kumar, replace, Ali Khan, pace bowler, all-rounder, USA squad, Under-19 allrounder, Andhra Pradesh, pace bowler, all-rounder, Siva Kumar, Ali khan, USA squad, America, Andhra Pradesh, Cricket, sports

D Siva Kumar, who was part of India's Under-19 World Cup-winning squad in Malaysia in 2008, has been drafted into the USA squad to replace the injured Ali Khan at ongoing T20 World Cup Qualifier in Zimbabwe. Ali was ruled out of the rest of the tournament after he suffered a broken forearm on the opening day of the tournament.

అమెరికా తరఫున అరంగ్రేటం చేయనున్న ఏపీ క్రికెటర్..

Posted: 07/18/2022 06:02 PM IST
Former india under 19 allrounder d siva kumar replaces ali khan in usa squad

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దువ్వారపు శివకుమార్‌ తన అదృష్టాన్ని అగ్రరాజ్యం అమెరికాలో పరీక్షించుకోనున్నారు. భారత దేశం తరపున అవకాశాల కోసం వేచి చూసిన ఆయనకు ఇక్కడ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అగ్రరాజ్యానికి వలస వెళ్లిన ఆయన ఆమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అమెరికా జట్ట తరపున నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ బరిలోకి దిగిన శివకుమార్ కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం‌. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆటగాళ్లకు భారత జట్టుకు అడేందుకు అవకాశాలు తక్కువ అని వినిపిస్తున్న నేపథ్యంలో శివకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఏపీలోని సిద్ధాంతంకు చెందిన శివకుమార్‌ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు. కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్‌ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్‌కు టీమ్‌లో చోటు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Under-19 allrounder  Andhra Pradesh  pace bowler  all-rounder  Siva Kumar  Ali khan  USA squad  America  Cricket  sports  

Other Articles