Jasprit Bumrah breaks Brian Lara's world record బ్యాటుతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా!

Jasprit bumrah smashes most runs in a single test over against stuart broad

Jasprit Bumrah, Jasprit Bumrah Indian cricket team Jasprit Bumrah Stuart Broad, Jasprit Bumrah 35 runs, Stuart Broad 35 runs, Bumrah Brian Lara, Stuart Broad 35 runs, Jasprit Bumrah, Stuart Broad, England, India vs England 5th Test, Brian Lara, highest runs, Sports news, Cricket news, Sports, Cricket

Indian tail-ender Jasprit Bumrah on July 2 registered a world record, as he scored the highest amount of runs of an over in Test cricket during the team's bout against England at the Edgbaston stadium in the UK's Birmingham. With Bumrah, a number-10 batter on the strike, England's top pacer Stuart Broad ended up conceding 35 runs of his over. Of these 35 runs, Bumrah scored 29 with the bat, whereas, six runs came in the form of extras.

స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో విరుచుకుపడి.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా!

Posted: 07/02/2022 08:13 PM IST
Jasprit bumrah smashes most runs in a single test over against stuart broad

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్ లోకి ఎంటంటే.. అతను బౌలర్ కాబట్టి అదే కోణంలో అలోచించకుండా ఆయన ఇవాళ ఒక ఓవర్లో తన బ్యాట్ ను జుళిపించిన విధానం చూస్తూ ఎవరికైనా మతిపోతుంది. బ్యాటింగ్‌లో. ఇంగ్లండ్ టెస్టు రెండో రోజున జడేజా అవుటైన తర్వాత బుమ్రా రెచ్చిపోయి ఆడాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.

బుమ్రా కొట్టిన సిక్సర్లలో ఒకటి నోబాల్ కూడా. దానికితోడు ఆ ఓవర్లో బ్రాడ్ వేసిన ఒక వైడ్ బాల్ బౌండరీకి వెళ్లింది. దీంతో ఏకంగా ఆ ఓవర్లో 35 పరుగులు వచ్చాయి. వీటిలో బుమ్రా సాధించిన పరుగులు 29. ఇలా టెస్టు మ్యాచ్‌లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.ఇంతకుముందు ఈ రికార్డు క్రికెట్ లెజెండ్ బ్రయాన్ లారా పేరిట ఉండేది. రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో లారా ఒకే ఓవర్లో 28 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.

అంతేకాదు, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన ఓవర్ వేసిన ఆటగాడిగా బ్రాడ్ కూడా ఒక చెత్త రికార్డును తన పేరిటి లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో కూడా ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు బ్రాడ్ పేరిట ఉంది. 2007లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్.. బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి 36 పరుగులు సాధించాడు. ఇప్పుడు మళ్లీ ఇండియాతో మ్యాచ్‌లోనే బ్రాడ్ మరో చెత్త రికార్డు సాధించగం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jasprit Bumrah  Stuart Broad  England  India vs England 5th Test  Brian Lara  highest runs  Sports  Cricket  

Other Articles

Today on Telugu Wishesh