Shreyas Iyer 16th Indian To Score Century On Test Debut అరంగ్రేటంతోనే సెంచరీ బాదిన శ్రేయస్.. 16వ ఆటగాడిగా రికార్డు..

Shreyas iyer slams century on test debut joins elite list of indian cricketers

Shreyas Iyer, India vs New Zealand 2021, Shreyas Iyer century, India vs New Zealand 1st Test, Shreyas Iyer maiden Test ton, Shreyas Iyer Kanpur Test, Kanpur Test, cricket news, sports news, sports, Cricket

Shreyas Iyer, the Test cricketer, marks his arrival in style with a century on Test debut. Replacing India skipper Virat Kohli for the Kanpur Test against New Zealand, Iyer reached the triple-digit figure on Day 2 of the first Test at the Green Park Stadium.

అరంగ్రేటంతోనే సెంచరీ బాదిన శ్రేయస్.. 16వ ఆటగాడిగా రికార్డు..

Posted: 11/26/2021 01:17 PM IST
Shreyas iyer slams century on test debut joins elite list of indian cricketers

టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్ర టెస్టు మ్యాచ్ లో సెంచరీ బాద రికార్డును సోంతం చేసుకోగా.. దీంతో పాటు పలు రికార్డులు సృష్టించాడు. టెస్టు మ్యాచులో అడుగుపెడుతున్న ఆయనకు తన టెస్టు క్యాప్ ను ప్రముఖ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నుంచి అందుకున్నారు. అంతే తన క్యాప్ కు కత్త విలువను అందించాడు. కాన్సూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్లోనే  సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఆర్.హెచ్ శోధన్, క్రిపాల్ సింగ్, అబ్బాస్ అలి బేగ్, హనుమంత్ సింగ్, గుండప్ప విశ్వనాథ్, సురిందర్ అమర్ నాథ్, మహమ్మద్ అజారుద్దీన్, ప్రవీణ్ అమ్రే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఫృధ్వీ షా తరువాత శ్రేయస్ అయ్యార్ ఈ అరుదైన ఫీటును సాధించాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచ్లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 168 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు శ్రేయాస్‌ అయ్యర్‌ సాధించాడు. ఓవర్ నైట్ సాధించిన 75 పరుగులకు ఇవాళ ఉదయం మ్యాచ్ ప్రారంభమయ్యాక మిగతా పరుగులు సాధించిన తన శతకాన్ని నమోదు చేశాడు.

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేధికగా ఈ ఆరంభ శతకాన్ని నమోదు చేసిన ఆటగాళ్లలో గుండప్ప విశ్వనాథ్ తరువాత అయ్యర్ రెండో క్రికెటర్ గా నిలిచాడు. విశ్వనాథ్ ఈ ఫీటను 1969లో సాధించగా, మళ్లీ దాదాపు ఐదు దశాబ్దాల తరువాత అయ్యార్ సాధించి రికార్డును నెలకోల్పాడు. మూడు వికెట్లు తీసిన జమీసన్ బాలింగ్ లో ఇవాళ ఉదయం ఐదు ఫోర్లు బాదిన అయ్యార్ ఈ శతకాన్ని తనదైన స్టైల్లో సాధించాడు. కాగా, 105 పరుగులు చేసిన అయ్యర్‌ సౌథీ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా తొలి రోజు మ్యాచ్‌ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌(303)ను శ్రేయస్‌ అయ్యర్‌ అందుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand 2021  Ind vs Nzl  Team india  new zealand  shreyas santosh iyer  sports  cricket  

Other Articles