Watch worth Rs 1.5cr, not Rs 5cr: Hardik Pandya హార్థిక్ పాండ్య ఖరీదైన విదేశీ చేతి వాచీలు సీజ్..

Hardik pandya clarifies on rs 5 crore watch seized by airport customs

Patek Philippe wrist watches, Hardik pandya costly wrist watches, Patek Philippe Hardik pandya, Hardik pandya singapore watches, customs seize, hardik pandya, Patek Philippe, T20 World Cup, TeamIndia, Batsman, Team India allrounder, cricket news, sports news, sports, Cricket

Cricketer Hardik Pandya on Tuesday refuted reports that claimed two wrist watches worth ₹ 5 crore were seized from him at the Mumbai airport on his return from Dubai, saying that only one watch worth ₹ 1.5 crore had been taken for "proper valuation".

హార్థిక్ పాండ్య ఖరీదైన విదేశీ చేతివాచీలు సీజ్..

Posted: 11/16/2021 06:57 PM IST
Hardik pandya clarifies on rs 5 crore watch seized by airport customs

టీమిండియా క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా వ‌ద్ద ఉన్న రెండు అతిఖ‌రీదైన చేతి గడియారాలను ముంబై క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ రెండు చేతివాచీల ఖ‌రీదు సుమారు రూ.5 కోట్లని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ నుంచి తిరిగివ‌స్తున్న హార్దిక్ ను ఆదివారం రాత్రి ముంబై విమానాశ్ర‌యంలో అధికారులు ప్ర‌శ్నించారు. ఆల్ రౌండ‌ర్‌ పాండ్యా వ‌ద్ద ఆ విలువైన వాచీల‌కు చెందిన బిల్లులు లేవ‌ని అధికారులు తెలిపారు. టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో ఆడేందుకు హార్దిక్ పాండ్యా దుబాయ్ వెళ్లిన విష‌యం తెలిసిందే. స్విట్జ‌ర్లాండ్ కు చెందిన ప‌టేక్ ఫిలిప్ కంపెనీ వాచీల‌ను ప్యాండా త‌న‌తో తీసుకువ‌స్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

ఇక ఈ వాచీల మీద ఉన్న సీరియ‌ల్ నెంబ‌ర్లు, బిల్లుపై వున్న ఇన్ వాయిస్ నెంబ‌ర్ల మ‌ధ్య తేడా ఉన్న కార‌ణంగా ఆ వాచీల‌ను సీజ్ చేశారు. ఆ వాచీలు త‌న వ‌ద్ద ముందు నుంచే ఉన్నాయ‌ని, అందులో ఒక‌దాని ఖ‌రీదు 1.4 కోట్లు అని, మ‌రో వాచీ ఖ‌రీదు సుమారు 40 ల‌క్ష‌లు ఉంటుంద‌ని హార్దిక్ తెలిపాడు. ఇన్ వాయిస్‌లో నెంబ‌ర్లు తేడా ఉన్నందు వ‌ల్ల‌.. హార్దిక్ మ‌రోసారి స‌రిచేసిన బిల్లును అధికారుల‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఖ‌రీదైన వాచీల‌పై ప్ర‌భుత్వం 38 శాతం ప‌న్ను వ‌సూల్ చేస్తుంది. ఒక‌వేళ పాండ్యా ఆ విలాస‌వంత‌మైన వాచీల‌కు చెందిన స‌రైన బిల్లుల‌ను స‌మ‌ర్పించ‌లేని ప‌క్షంలో ఆ వాచీల‌ను అధికారులు పూర్తిగా సీజ్ చేయ‌నున్నారు.

సోష‌ల్ మీడియాలో త‌న వాచీలపై త‌ప్పుడు ప్ర‌చారం జరగడంతో దీనిపై తాజాగా స్పందించిన హార్దిక్ పాండ్యా ఘటనపై క్లారిటీ ఇచ్చాడు. ముంబై విమానాశ్రయంలో క‌స్ట‌మ్స్ అధికారుల వద్దకు తానే స్వ‌యంగా వెళ్లాన‌ని, తాను తీసుకువ‌చ్చిన ఐట‌మ్స్ గురించి క‌స్ట‌మ్స్ డ్యూటీ క‌ట్టేందుకు అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు హార్ధిక్ త‌న ట్విట్ట‌ర్లో వివ‌ర‌ణ ఇచ్చారు. చ‌ట్ట‌బ‌ద్దంగానే దుబాయ్ లో వాచీలు కొన్నాన‌ని, వాటికి డ్యూటీ క‌స్ట‌మ్ క‌ట్టేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు కస్టమ్స్ అధికారులకు కూడా చెప్పానని పాండ్య చెప్పాడు. క‌స్ట‌మ్స్ అధికారులు తన వద్దనున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారని తెలిపాడు. తాను వాచీ ఖరీదు తెచ్చిన వాచీ ఖ‌రీదు 1.5 కోట్లు మాత్ర‌మే అని హార్థిక్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : costly watches  customs seize  hardik pandya  Patek Philippe  T20 World Cup  TeamIndia  Batsman  cricket  sports  

Other Articles