BCCI increases match fees for domestic cricketers దేశ‌వాళీ క్రికెట‌ర్ల‌కు బిసిసిఐ గుడ్‌న్యూస్..

Pay rise bcci announces hike in match fee for domestic cricketers

BCCI, BCCI announces domestic pay hike, indian domestic cricketers pay rise, india cricket news, ranji trophy payment, ranji trophy revised pay structure, india cricket news, ranji trophy, cricket news, sports news, sports, Cricket

There was finally some news to cheer about for the domestic cricketers after the Board of Control for Cricket in India (BCCI) decided to increase the match fees for players across all age groups in men’s and women’s cricket. The board also announced they will compensate domestic players who suffered financially after last season’s Ranji Trophy and women’s T20 games were curtailed due to the Covid-19 pandemic.

దేశ‌వాళీ క్రికెట‌ర్ల‌కు బిసిసిఐ గుడ్‌న్యూస్.. మ్యాచ్ ఫీజు పెంపు..

Posted: 09/20/2021 03:21 PM IST
Pay rise bcci announces hike in match fee for domestic cricketers

ప్ర‌పంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసిసిఐ ఇప్పటి వరకు కేవలం టీమిండియా ప్లేయర్లకే పెద్దపీట వేస్తుందన్న వార్తలున్నాయి. దీంతో వాటిని బాపుకుంటూ దేశ‌వాళీ క్రికెట‌ర్ల‌కు కూడా బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల మ్యాచ్ ఫీజుల‌ను పెంచుతున్న‌ట్లు బోర్డు కార్య‌ద‌ర్శి జే షా సోమ‌వారం ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. సీనియ‌ర్ ప్లేయ‌ర్స్‌కు, అండ‌ర్ 23, అండ‌ర్ 19 క్రికెట‌ర్ల మ్యాచ్ ఫీజుల‌ను బోర్డు పెంచింది. 40 మ్యాచ్‌ల‌కుపైగా ఆడిన అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ దేశ‌వాళీ క్రికెట‌ర్ల‌కు ఇక నుంచి ఒక రోజు మ్యాచ్ ఫీజును రూ.60 వేల‌కు పెంచిన‌ట్లు జే షా చెప్పారు. ఇన్నాళ్లూ వీళ్లు రంజీ ట్రోఫీ లేదా విజ‌య్ హ‌జారే ట్రోఫీలో పాల్గొంటే మ్యాచ్ రోజు రూ.35 వేలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దానిని రూ.60 వేల‌కు పెంచారు.

ఇక అండ‌ర్ 23 క్రికెట‌ర్ల‌కు రూ.25 వేలు, అండ‌ర్ 19 క్రికెట‌ర్ల‌కు రూ.20 వేలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వ‌నున్న‌ట్లు జే షా వెల్ల‌డించారు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే క్రికెట‌ర్ల‌కు రూ.17500 ఇస్తున్నారు. తుది జ‌ట్టులో ఆడే ప్లేయ‌ర్స్‌కు ఈ మ్యాచ్ ఫీజు ఇస్తుండగా.. రిజ‌ర్వ్ ప్లేయ‌ర్స్ ఇందులో స‌గం మొత్తం అందుకుంటారు. ఇక గ‌తేడాది కరోనా కార‌ణంగా దేశ‌వాళీ సీజ‌న్ న‌ష్ట‌పోవ‌డంతో క్రికెట‌ర్ల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. 2019-20 సీజ‌న్ ఆడిన క్రికెట‌ర్ల‌కు 2020-21 సీజ‌న్‌లో 50 శాతం అద‌నంగా చెల్లించ‌నున్న‌ట్లు కూడా జే షా ప్ర‌క‌టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles