Virat Kohli to quit RCB captaincy after this season మరో సంచలన నిర్ణయం తీసుకున్న కోహ్లీ..

Virat kohli to discontinue as the skipper of rcb after ipl 2021

virat kohli captaincy, royal challengers bangalore captain virat kohli, rcb captain virat kohli, virat kohli world cup, Teamindia virat kohli, virat kohli, virat kohli rcb, royal challengers bangalore, rcb, world cup, india, virat kohli, t20 world cup, sports, cricket

Virat Kohli will step down as captain of his IPL team Royal Challengers Bangalore at the end of the ongoing season, the Indian batting maestro announced on Sunday, two days after deciding to quit national T20 captaincy following next month's World Cup.

మరో సంచలన నిర్ణయం తీసుకున్న కోహ్లీ.. ఆర్సీబీ కెప్టెన్సీ కూడా..

Posted: 09/20/2021 10:50 AM IST
Virat kohli to discontinue as the skipper of rcb after ipl 2021

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత ఫొట్టి ఫార్మెట్ సారథ్య పగ్గాలను వదిలేస్తున్నట్టు ఇటీవల ప్రకటించి షాకిచ్చిన ఆయన తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ.. బెంగళూరుకు కెప్టెన్ గా ఇదే తన చివరి ఐపీఎల్ అని ప్రకటించి అభిమానులను విస్మయపరిచాడు. కాగా, తన కెరియర్ ముగిసే వరకు మాత్రం బెంగళూరుతోనే ఉంటానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత తేలిక కాకపోయినప్పటికీ ఫ్రాంచైజీ ప్రయోజనాల కోసం సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు.

టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రకటించినప్పటి నుంచే ఈ విషయంపైనా ఆలోచించానని, సహచర ఆటగాళ్లతోనూ చర్చించానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీకి నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. ఈ అవకాశం కల్పించిన బెంగళూరు మేనేజ్‌మెంట్‌కు, కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. కోహ్లీ అనూహ్య నిర్ణయంపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. బెంగళూరు జట్టుకు కోహ్లీ గొప్ప ఆస్తి అని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆర్సీబీ చైర్మన్ ప్రథమేశ్ మిశ్రా అన్నారు. కాగా, బెంగళూరు తరపున ఇప్పటి వరకు 199 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 5 శతకాలతో 6076 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : royal challengers bangalore  rcb  world cup  india  virat kohli  virat kohli rcb  t20 world cup  sports  cricket  

Other Articles