Pujara Claims He Still Has Aspirations to Play white-ball Cricket లిమిటెడ్ ఓవర్ క్రికెట్ ఆడాలని వుంది: పూజారా

Cheteshwar pujara claims he still has aspirations to play white ball cricket for team india

Cheteshwar Pujara, Pujara, Pujara ODI, Team India, India vs Australia, Pujara in ODI, India vs Australia 2020-21, India vs England 2021, sports news. Cricket news, sports. Cricket

Test specialist Cheteshwar Pujara has claimed that he still has aspirations to play white-ball cricket for Team India. Pujara had made a big name for himself in Test cricket but he failed to make an impact in limited-overs cricket with the games he’s player

టీమిండియా తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడాలని వుంది: పూజారా

Posted: 01/29/2021 10:26 PM IST
Cheteshwar pujara claims he still has aspirations to play white ball cricket for team india

టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలనే ఆకాంక్ష బలంగా ఉందని టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌, నయావాల్‌ పుజారా అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఆస్ట్రేలియా పర్యటనపై  మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో నయావాల్‌ ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సిరీస్‌కు తగిన ప్రాక్టీస్‌ లేకపోయినా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

‘నాకింకా టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలనే కోరిక బలంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అదే సమయంలో ఇతర ఆటగాళ్లు ఆడుతుంటే నాకా అవకాశం రాదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు లాక్‌డౌన్‌లో సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. అందువల్లే ఈ టోర్నీకి సన్నద్ధమవ్వడానికి ఇబ్బందులు పడ్డాను. ఒకవేళ ఈ కరోనా వైరస్‌ లేకపోతే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌‌లు ఆడేవాడిని. దాంతో మంచి ప్రాక్టీస్‌ లభించేది. ఈ సిరీస్‌కు ముందు ఒకే ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ ఆడాను. తర్వాత మ్యాచ్‌లు ఆడేకొద్ది మునుపటి లయ అందుకోగలిగాను’ అని పుజారా వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles