Rishabh Pant seeks suggestions from fans అభిమానులను సలహా కోరిన రిషబ్ పంత్

Rishabh pant is looking for new house seeks suggestions on twitter from fans

Rishabh Pant, India Vs Australia, India tour of Australlia 2020, House Hunting, Twitter reaction, sports news. Cricket news, sports. Cricket

Team India wicket-keeper batsman Rishabh Pant after coming from Australia has been on a house hunt and he came to Twitter for the suggestions. Pant, took to Twitter to mention that his family has been pestering him to buy a new house, since the time he has arrived from Australia.

ఆ విషయంలో అభిమానులను సాయం కోరిన రిషబ్ పంత్

Posted: 01/29/2021 09:43 PM IST
Rishabh pant is looking for new house seeks suggestions on twitter from fans

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ అస్ట్రేలియా సిరీస్ లో హీరోగా నిలవడంతో ఆయనకు ప్రస్తుతం భారీగా ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆయన తనకు అందివచ్చిన అవకాశాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచి తనని ఓ విషయంలో ఇంట్లోవాళ్లు తొందర పెడుతున్నారని టీమిండియా యువ హీరో రిషభ్‌పంత్‌ అన్నాడు. అంతే ఈ పనిలో తనకు కొంత సహాయం చేయాలని తన ఫాలోవర్లను కోరాడు.

కంగారులను కంగారెత్తించి వారి సొంతగడ్డపైనే టెస్టు సిరీస్‌ దక్కించుకుని.. భారత్‌ చారిత్రక విజయంలో కీకీలక పాత్ర పోషించిన పంత్ ఈ మేర సహాయం కోరగానే అభిమానుల నుంచి కూడా సమాధానాలు వెల్లువెత్తాయి. ఇంతకీ అదేంటంటో ఆయన మాట్లల్లోనే.. ‘నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. ఇప్పుడైనా కొత్త ఇల్లు తీసుకోమని మా ఇంట్లోవాళ్లు వెంటపడుతున్నారు. అందుకోసం గురుగ్రామ్‌ బాగుంటుందా? లేదా వేరే ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పండి’ అని అభిమానులను అడిగాడు.

కాగా, పంత్‌ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముంబయి, నోయిడా, కాన్పూర్‌, ముజఫర్‌నగర్‌ ఇలా అనేక ప్రదేశాలు బాగున్నాయని అభిమానుల నుంచి కామెంట్లు వచ్చాయి. కాగా, పంత్‌ ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు నామినేషన్లలో ఉన్నాడు. ఆసీస్‌ పర్యటనలో అతడితో పాటు అద్భుత ప్రదర్శన చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌లు సైతం ఆ అవార్డు రేసులో నిలిచారు. వీళ్లంతా టీమిండియా విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles