కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాకారులు ముందుకు రాగా, తొలిసారిగా దేశంలో అత్యధికమంది ప్రజలు ఆదరించే క్రికెట్ నుంచి టీమిండియా క్రికెటర్, పంజాబ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మన్ దీప్ సింగ్ సింఘు చేరకుని రైతులకు తన మద్దతును ప్రకటించారు, రైతులకు మద్దతివ్వడమే కాకుండా.. స్వయంగా వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. తన సోదరుడు హర్వీందర్ సింగ్, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన సింఘు సరిహద్దుకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు.
సోమవారం రోజునే సింఘుకు చేరుకున్న వీరు మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అన్నదాతలతో పాటు రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పిన మన్ దీప్.. రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదని, త్వరలోనే అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను చూసి చలించిపోయా. అందుకే వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యే నా తండ్రి చనిపోయారు. నాన్న బతికుంటే ఆయన కూడా వచ్చి ఆందోళనలో పాల్గొనేవారు’ అని మన్ దీప్ మీడియాతో చెప్పారు.
28ఏళ్ల మన్దీప్ ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడాడు. ఆ సమయంలోనే మన్దీప్ తండ్రి, అథ్లెటిక్స్ మాజీ కోచ్ హర్దేవ్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలిసినా.. ఆ బాధను దిగమింగుకుని మ్యాచ్ ఆడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. కాగా.. రైతుల ఆందోళనకు ఇప్పటికే ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాప్రముఖులు మద్దతు పలికారు. అన్నదాతలకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన కొందరు క్రీడాకారులు తమ పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
Waheguru mehar kari! Sab jaldi theek hove#FarmersProtest #Tractor2Twitter #NoFarmersNoFood pic.twitter.com/Ja7OIjDRj8
— Mandeep Singh (@mandeeps12) December 9, 2020
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more