Hardik Pandya Is A Pure Batsman: Aakash Chopra హార్థిక్ ఫాండ్యకు త్వరలోనే లైనప్ లో ప్రమోషన్: చోప్రా

Aakash chopra believes hardik pandya will be promoted up the batting order in future

Aakash Chopra, Hardik Pandya, Inida vs Australia, Ind vs Aus, Aus vs Ind, first ODI, Sydney Cricket Ground, Shikhar Dhawan, Youtube video, Sports, Cricket

Aakash Chopra reckons that Hardik Pandya might be promoted up the order after he had scored a valiant knock against Australia in the first ODI at the Sydney Cricket Ground on Friday. Pandya, who had come out to bat at number six added 128 runs along with opener Shikhar Dhawan for the fifth-wicket stand after India were starring down the barrel at 101/4 during their mammoth run chase of 375.

హార్థిక్ ఫాండ్యకు త్వరలోనే లైనప్ లో ప్రమోషన్: చోప్రా

Posted: 11/28/2020 11:35 PM IST
Aakash chopra believes hardik pandya will be promoted up the batting order in future

తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు నైపుణ్యం గల బ్యాట్స్ మెన్‌ కన్నా.. ఆ కీలక సమయంలో ఫాండ్యా లాంటి ఆటగాడు అత్యంత అవసరమన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో కొద్దిపాటి పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడని చెప్పిన చోప్రా.. పాండ్య సాధించిన కీలకమైన 90 పరుగులు జట్టుకు ఘోర ఓటమి నుంచి తప్పించాయని అన్నారు.

ఫాండ్యా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నంత సేపు భారత శిబిరంలో ఆశలు నిలిపాడని ఆకాశ్‌ పేర్కొన్నాడు. తన యూట్యూబ్‌ ఛానెల్ లో మాట్లాడిన చోప్రా ఈ మ్యాచ్ పై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా పాండ్య ఆటను పొగడ్తలతో ముంచెత్తాడు. టీమీండియా పూర్తిస్థాయిగా పాండ్య అవతరిస్తున్నాడని, ఇలానే మున్ముందు కూడా రాణిస్తే జట్టులో అతని స్థానం కూడా మరింత ముందుకు పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అటు బంతితో రాణిస్తున్న ఈ అల్ రౌండర్.. బ్యాట్ తో కూడా బాగా రాణిస్తే అతడు ఆడుతున్న ఆరో స్థానం నుంచి అతడ్ని నాలుగైదు స్థానాలకు కూడా జట్టు యాజమాన్యం మార్చవచ్చునని అన్నాడు.

అవకాశాల కోసం వేచి చూడకుండా వచ్చిన దానినే సద్వినియోగం చేసుకున్న పాండ్యా..  షార్ట్ పిచ్‌ బంతులను దీటుగా ఎదుర్కొన్నాడని అన్నాడు. స్పిన్నర్లను కూడా ఉతికారేశాడని ప్రశంసించాడు, ధావన్ తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా అతడే 75 పరుగులు చేశాడు. పాండ్య అద్భతమైన ఆటతో ఆకట్టుకున్నాడన్నాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఆరోన్‌ ఫించ్‌(114), స్టీవ్‌స్మిత్‌(105) శతకాలతో మెరవగా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. పాండ్య(90), ధావన్‌(74) అర్ధ శతకాలు సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles