ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోమారు ‘బుట్టబొమ్మా’ పాటకు తన లయబద్దంగా మూవ్ మెంట్స్ చేశాడు, అయితే తాను ఎక్కడ వున్నానని సంగతి తెలిసే కాబోలు ఆయన స్టెప్పులు వేయకుండా కేవలం లైట్ మూవ్ మెంట్స్ తో అభిమానులను అలరించాడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ఈ పాట ఇప్పటికే విశేష ఆదరణ సంపాదించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కు ముందు కూడా ఈ పాటకు చక్కటి స్టెపులు వేసి అదరగోట్టిన ఆయన ఐపీఎల్ లోనూ తన జట్టు చక్కటి ప్రదర్శన ఇచ్చి ప్లేఆఫ్ కు వెళ్లడంతో తన జట్టుతో కలసి ఇదే పాటకు డాన్స్ అదరగోట్టారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే కూర్చిండిపోవాల్సి వచ్చిన సమయంలో ఆ పాటను చూసి.. దానికి అనుగూణంగా డాన్స్ వేశాడు వార్నర్. ఈ పాటకు ఆయన పూర్తి కుటుంబం మొత్తం డాన్స్ చేసింది. అంతటితో ఆగలేదు.. దానిని టిక్ టాక్ సహా సోషల్ మీడియా వేదికగా అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి, దీంతో సన్ రైజర్స్ హదరాబాద్ జట్టు కెప్టెన్ గా, ఆస్ట్రేలియా ఓపెనర్ తెలుగు అభిమానులకు మరింత చేరువచేసింది. ఇక ఐపీఎల్ లోనూ తమ జట్టు టాప్ 4లో స్థానం సంపాదించడంలో ఆయన తన జట్టుకు ఇచ్చిన పార్టీలోనూ ఇదే పాట సందడి చేయడంతో పాటు ఆటగాళ్లందరూ స్టెప్పులతో అదరగోట్టారు.
ఇక తాజాగా క్రితం రోజు టీమీండియాతో తలపడిన తొలి వన్డేలోనూ ఈ విధ్వంసక ఓపెనర్ మరోసారి ఆ పాటకు స్టెప్పులేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా.. మైదానంలో పీల్డింగ్ చేస్తున్న వార్నర్ ను బౌండరీలో వున్న కొందరు తెలుగు అభిమానులు పలకరించి బుట్టబొమ్మ పాటను పాడారు. దీంతో ఆయన బుట్టబొమ్మా బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ చేశాడు. స్టేడియంలోని ప్రేక్షకులు దాన్ని వీడియో తీయడంతో అదిప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు దాన్ని షేర్ చేస్తూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా ఛేదనలో భారత్ 308/8కే పరిమితమైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆరోన్ ఫించ్(114; 124 బంతుల్లో 9x4, 2x6), స్టీవ్‌స్మిత్(105; 66 బంతుల్లో 11x4, 4x6) శతకాలతో మెరవగా వార్నర్ (69; 76 బంతుల్లో 6x4) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్య(90; 76 బంతుల్లో 7x4, 4x6), శిఖర్ ధావన్(74; 86 బంతుల్లో 10x4) పోరాడారు. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో టీమ్‌ఇండియా ఈ సుదీర్ఘ పర్యటనను ఓటమితో ఆరంభించింది. ఆదివారం కోహ్లీసేన రెండో వన్డే ఆడనుంది.
Buttabomma and Warner Never Ending Love Story.#AUSvIND @davidwarner31 pic.twitter.com/TjEeMKzgt3
— M A N I (@Mani_Kumar15) November 27, 2020
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more