India fined for slow over rate in the first ODI vs Aus విరాట్ కోహ్లీ సేనకు ఐసీసీ జరిమానా..

Icc fines india for slow over rate in first odi against australia

ICC, India, Australia, India vs Australia, slow over rate, Virat Kohli, David Warner, first ODI, Sydney Cricket Ground, Australia vs India, Aus vs Ind, sports, Cricket, sports news, cricket news

The Indian cricket team was fined 20 per cent of its match fee for maintaining a slow over-rate against Australia in the series opening first ODI in Sydney. India took an unprecedented four hours and six minutes to complete their 50 overs during their 66-run loss in the first ODI. ICC match referee David Boon imposed the sanction after India was ruled to be one over short of the target after time allowances were taken into consideration.

అసీస్ తో తొలి వన్డే: విరాట్ కోహ్లీ సేనకు ఐసీసీ జరిమానా..

Posted: 11/28/2020 10:55 PM IST
Icc fines india for slow over rate in first odi against australia

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసిన తరుణంలోనే మరో పరాభవం కూడా ఎదురైంది, టీమిండియా ఆటతీరు ఆలస్యంగా సాగిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారత జట్టుకు జరిమానా విధించింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా టీమిండియాకి ఐసీసీ జరిమానా విధించింది. అయితే మరింతగా పరిస్థితులు మారకుండా, వుండేందుకు భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ ఐసీసీకి క్షమాపణలు చెప్పాడు, బౌలింగ్ చేసే సమయంలో టీమిండియా ఏకంగా నాలుగు గంటల ఆరు నిమిషాల సమయాన్ని తీసుకుంది.

దీంతో ఇంతగా నిదానించిన ఓవర్ రేట్ కు ఫలితంగా జరిమానాను కట్టనుంది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్‌ ఫీల్డ్ అంపైర్లు రాడ్‌ టకర్, సామ్‌, టీవీ అంపైర్ పాల్‌ రీఫెల్‌, ఫోర్త్‌ అంపైర్ గెరార్డ్‌ అబూద్ ఫిర్యాదు మేరకు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది.

మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా మైదానంలో ఆట ఆలస్యంగా సాగిందని అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి ఇన్నింగ్స్ లో మొదట కొంత మంది ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. దీనికి కొంత సమయం పట్టింది. నిర్దేశించిన సమయం కంటే భారత్ 45 నిమిషాలు ఎక్కువగా తీసుకుందనిపించింది’’ అని స్మిత్ అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇదే మైదానంలో రెండో వన్డే ఆదివారం జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC  India  Australia  India vs Australia  slow over rate  Virat Kohli  David Warner  first ODI  Aus vs Ind  sports  Cricket  

Other Articles