Wade brought undone by contentious fielding law ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

Wade brought undone by contentious fielding law

Matt Renshaw, Tom Banton, Matthew Wade, Big Bash League, Hobart Hurricanes, Brisbane Heat, BBL 2019-20, sports news, cricket, sports, cricket, sports

Matthew Renshaw's juggling boundary-line effort at the Gabba in the KFC BBL on Thursday night left umpires and fans flummoxed, with the Heat fielder capitalising on an unusual change to the Laws of cricket some six years ago.

ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

Posted: 01/10/2020 09:26 PM IST
Wade brought undone by contentious fielding law

టీ20 క్రికెట్‌ తెరపైకి వచ్చిన తర్వాత ఫీల్డింగ్‌లో అథ్లెటిక్‌ విన్యాసాలు చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌ లీగ్లో ఇలాంటి మరో అద్భుతం చోటుచేసుకుంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాట్‌ రెన్ షా కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఈ విన్యాసం చూసిన అంపైర్లకు, ఆటగాళ్లకు అది ఔటో.. నాటౌటో అర్థంకాక తికమక పడ్డారు. చివరికి ఆ బ్యాట్స్ మన్‌ నిష్క్రమించడంతో మ్యాచ్‌ కొనసాగింది. ఇది ఔటా.? కాదాన్న చర్చకు దారితీసింది.

అసలేం జరిగిందంటే.. హరికేన్స్‌ కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ భారీ షాట్ ను సిక్స్‌ గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ వద్దకు పరుగెత్తుకెళ్లిన మ్యాట్‌ రెన్ షా బంతిని అందుకున్నాడు. అదే సమయంలో అదుపు తప్పడంతో బంతిని గాల్లోకి ఎగిరేసి తాను బౌండరీ దాటాడు. ఆ సమయంలో బంతికి తిరిగి బౌండరీ లైన్ దాటి వస్తుందని గ్రహించిన రెన్ షా.. ఎగిరి మరీ బంతిని మళ్లీ గాల్లోకి విసిరే క్రమంలో తనవైపు వస్తున్న మరో ఫీల్డర్ ను గమనించి అతనిపైవుకు విసిరాడు. దీంతో అంతా అవ్యాక్కయ్యారు.

లార్డ్స్‌ మైదానం పేరిట ఉన్న ఓ ట్విటర్లో ఈ వీడియో పోస్టు చేయడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉండగా క్రికెట్‌ నిబంధన 19.5 ప్రకారం అది ఔట్‌గా తేలింది. ఫీల్డర్‌ తొలిసారి బంతి అందుకున్నప్పుడు మైదానం లోపల ఉండటం, రెండోసారి గాలిలో ఉండటం వల్ల దాన్ని ఔట్‌గా గుర్తించాలని ఉంది. ఇది క్రికెట్‌ అభిమానుల్లో మరో చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ఇలాంటి క్యాచ్ ఇప్పటివరకు నమోదు కాకపోవడంతో రెన్ షా అథ్లెటిక్స్ క్యాచ్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరీ మీరేమంటారు.?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Matt Renshaw  Tom Banton  Matthew Wade  Big Bash League  BBL 2019-20  cricket  sports  

Other Articles