Sachin Tendulkar hilariously trolls Ganguly సౌరవ్ ను సరదాగా అటపట్టించిన సచిన్

Sourav ganguly posts coaching picture sachin tendulkar hilariously trolls him

India vs England, Australia, Sri Lanka T20Is, India vs Australia, sourav ganguly, Sachin Tendulkar, weather, Instagram, trolling, health consultation, health freak, coaching days, hilariously troll, Board of Control for Cricket in India, bcci president, bcci, BCCI, BCCI's selection policy, Team India, Cricket, sports, sports news, cricket, sports, cricket, sports

Cricket icon Sachin Tendulkar and previous India captain and Board of Keep watch over for Cricket in India (BCCI) president Sourav Ganguly engaged in a hilarious banter on social media that left lovers in splits.

సౌరవ్ ను సరదాగా అటపట్టించిన సచిన్

Posted: 01/10/2020 07:21 PM IST
Sourav ganguly posts coaching picture sachin tendulkar hilariously trolls him

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్‌ గంగూలీని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండ్కులర్ సరదాగా అటపట్టించాడు. వీరిద్దరూ కలసి టీమిండియా క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య స్నేహం కూడా అదేస్థాయిలో వుందనేందుకు వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ సరదా కామెంట్ల సన్నివేశమే తార్కాణం. నిత్యం హుందాగా వుండే సచిన్ కేవలం తనదైన వ్యక్తులతో మాత్రమే సరదాగా వ్యవహరిస్తారు. చాలకాలం తరువాత ఆయన ఇవాళ సౌరభ్‌ గంగూలీ ట్వీట్ ను ట్రోల్‌ చేశాడు. వీరిద్దరి సరదా కామెంట్లు ఎలా సాగాయంటే..

దాదా తన ఇన్ స్టాగ్రామ్ లో ‘‘ఉదయాన్నే చల్లని వాతావరణంలో మంచి ఫిట్ నెస్‌ సెషన్ ను చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది’’ అని పోస్ట్‌ చేశాడు. దీనికి సచిన్‌.. ‘‘వెల్ డన్‌ దాది! ఏం చెప్పావ్‌’’ అని సరదాగా కామెంట్ చేశాడు. అయితే దాదా సచిన్‌ కామెంట్‌కు ‘‘థాంక్యూ ఛాంపియన్‌. ఎల్లప్పుడూ ఫిట్‌నెస్ పైనే దృష్టి. మన అద్భుతమైన శిక్షణ రోజులు నీకు గుర్తున్నాయా’’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి సచిన్ ‘‘అవును దాది.. శిక్షణలో నువ్వు ఎంత ఎంజాయ్‌ చేశావో అందరికీ గుర్తుంది. ప్రత్యేకంగా స్కిప్పింగ్ లో’’ అని బదులిచ్చాడు. ఈ దిగ్గజ క్రికెటర్ల సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

సచిన్-దాదా కలిసి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగి రికార్డుల భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి 136 ఇన్నింగ్స్‌ల్లో 49.32 సగటుతో 6,609 పరుగులు చేశారు. వన్డే, టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, శతక శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా దాదా రికార్డు నమోదుచేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles