దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అద్భుత శతకం బాదేశాడు. టెస్టుల్లో 26వ శతకం అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతడికిది 69వ సెంచరీ కావడం గమనార్హం. మ్యాచ్‌లో రెండో రోజు ఆటంతా విరాట్‌దే. అతనాడిన కవర్‌డ్రైవ్‌లు చూడముచ్చటగా అనిపించాయి. తనట్రేడ్ మార్క్ షాట్లతో చెత్త బంతులను బౌండరీకి తరలించాడు.
మంచి లయలో ఉన్న అతడు ద్విశతకం చేసినా ఆశ్చర్యం లేదు. తొలిరోజు కోహ్లీ దక్షిణాఫ్రికా ఫీల్డర్లను ఆటపట్టించిన సరదా సన్నివేశం ఒకటి శుక్రవారం వైరల్‌గా మారింది. మొదటి రోజు 66వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ బంతిని పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రబాడ కుడివైపునకు ఆడాడు. త్వరిత పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే పరుగెత్తుకుంటూ వచ్చిన రబాడ బంతిని వంగి అందుకొని వికెట్ల వైపు విసిరాడు.
అది వికెట్లకు ఆమడ దూరం నుంచి బౌండరీ సరిహద్దుకు చేరుకుంది. అదనంగా నాలుగు పరుగులు లభించిన తర్వాత కోహ్లీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఆటపట్టిస్తూ థమ్స్‌అప్ చిహ్నం వారికి చూపించాడు. చురకత్తుల్లాంటి బంతులు సంధించే రబాడతో విరాట్‌కు అనధికార పోటీ ఉన్న సంగతి తెలిసిందే. 127 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 152 పరుగులతో అజేయంగా ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more