Kohli reveals reason behind replacing Hanuma Vihari హనుమ విహారి స్థానంలో ఉమేష్ యాదవ్.. ఎందుకంటే..

Virat kohli reveals reason behind replacing umesh yadav with hanuma vihari

virat kohli, hanuma vihari, umesh yadav, virat kohli india vs south africa, india vs south africa 2nd test, pune test ind vs sa, virat kohli test captaincy, hanuma vihari out of pune test, umesh yadav in pune test, virat kohli sourav ganguly, virat kohli mahendra singh dhoni, cricket news, sports news, sports, cricket

Explaining the reason behind the change, the India captain Virat Kohli said an extra batsman will be a luxury here and hence “Hanuman Vihari misses out, Umesh Yadav replaces him”.

హనుమ విహారి స్థానంలో ఉమేష్ యాదవ్.. ఎందుకంటే..

Posted: 10/10/2019 03:03 PM IST
Virat kohli reveals reason behind replacing umesh yadav with hanuma vihari

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. తుది జట్టులో ఒక మార్పు చేశాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసిన కోహ్లీ.. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు. భారత కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే వుందని కూడా వివరించాడు.

విశాఖపట్నం వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో.. మొదటి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటైన విహారికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లను ఈ తెలుగు క్రికెటర్‌తో విరాట్ కోహ్లీ వేయించగా.. 38 పరుగులు ఇచ్చిన విహారి కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో.. రెండో ఇన్నింగ్స్‌లో అతని చేతికి భారత కెప్టెన్ బంతినివ్వలేదు. మొత్తంగా.. వైజాగ్ టెస్టులో విహారి ప్రదర్శన ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ కనిపించలేదు.

ఈ కారణంగానే పుణె టెస్టులో అతనిపై వేటు వేశారని అంతా ఊహించారు. కానీ.. విహారిని ఎందుకు తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందో..? కోహ్లీ వివరించాడు. ‘పుణె పిచ్‌‌పై బౌలింగ్ చేయాలంటే కొంచెం కష్టం. అందుకే తుది జట్టులోకి ఐదో బౌలర్‌ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలకి తోడుగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేయనున్నాడు.

బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలనే కారణంతోనే హనుమ విహారి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ని ఎంచుకున్నాం’ అని కోహ్లీ వెల్లడించాడు. వైజాగ్ టెస్టులో వికెట్ కీపర్‌తో కలిపి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లు, నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగిన టీమిండియా 203 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా తుది జట్టులోకి అదనంగా ఓ బౌలర్‌ని ఎంచుకోవడం ద్వారా.. ఒక బ్యాట్స్‌మెన్‌ని తగ్గించుకున్నట్లయింది.  

భారత్ తుది జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india vs south africa  pune 2nd test  hanuma vihari  umesh yadav  cricket  sports  

Other Articles