team needed 6 off 1 ball, won with 1 ball to spare ఒక్క బంతి 6 పరుగులు.. ఇలా కూడా గెలవొచ్చా..!

Maharashtra team needed 6 off 1 ball they won with 1 ball to spare without hitting a 6

Desai cricket team, Juni Dombivli cricket team, maharashtra cricket, wide balls, wide balls victory, bizarre cricket videos, cricket videos, Indian cricket, cricket, Indian cricket team, cricket news, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

With the scoreboard displaying 70/4 in 4.5 overs, Desai needed six runs to win in the final ball. But in a weird play of events, the left-arm bowler who was on the attack gave away six wides in a row, making Desai win with still on ball in his kitty.

ఒక్క బంతి 6 పరుగులు.. సిక్స్ కొట్టకుండా బంతి మిగులుతో విజయం

Posted: 01/10/2019 08:41 PM IST
Maharashtra team needed 6 off 1 ball they won with 1 ball to spare without hitting a 6

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో!’ అన్న మాట క్రికెట్‌‌కి కచ్చితంగా సరిపోతుంది. నిజమే మరి మ్యాచ్‌లో బంతి బంతికీ కథ మారిపోతుంటుంది. ఇక క్రికెట్‌ చరిత్రలో ఆఖరి బంతికి ఆరు కొట్టి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇలానే ఓ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ అవసరమైంది. కానీ, వారు సిక్స్‌ కొట్టకుండానే ఆరు పరుగులు వచ్చాయి. అదెలాగంటే..

ఆదర్శ్‌ క్రికెట్‌ క్లబ్‌(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా జుని జట్టుపై గెలవడానికి దేశాయ్‌కు 6 పరుగులు కావాల్సివచ్చింది. అయితే, ఒకే బంతి మిగిలి ఉండటంతో ఇటు అభిమానులకు, అటు ఆటగాళ్లకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీరా మొదటి బాల్‌ పడింది.. అది కాస్త వైడ్‌. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్‌! అలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్‌ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్‌ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles